వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధుకర్ కేసు: ఖానాపూర్ సర్పంచ్ సహ 5 అరెస్టు, కాల్ డేటా పరిశీలన

మంధనిలో అనుమానాస్పదస్థితిలో మరణించిన మధుకర్ మృతి కేసులో ఖానాపూర్ సర్పంచ్ ఓదెలు సహ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి: మంధనిలో అనుమానాస్పదస్థితిలో మరణించిన మధుకర్ మృతి కేసులో ఖానాపూర్ సర్పంచ్ ఓదెలు సహ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

మధుకర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. ,ప్రజాసంఘాలు దళిత సంఘాలు అనేక ఆందోళనలు చేస్తున్నాయి.ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.

మధుకర్ ను హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే ఈ విషయమై రాజకీయ నాయకులప్రమేయం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే పుట్టమధుపై మధు కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

Police arrested five members for Mandhani Madhukar death case

అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తున్నారు.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సిఐ ప్రభాకర్ పై వేటు పడింది. మధుకర్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ప్రభాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది.

మరో వైపు ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఖానాపూర్ సర్పంచ్ ఓదెలు సహ ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

అనుమానితుల సెల్ ఫోన్లను, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ నెల 7వ, తేదిన మధుకర్ మృతదేహనికి కాకతీయ మెడికల్ కాలేజీలో రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

English summary
Police arrested five members including Khanapur sarpanch Odel for Madhukar death case.Police will examine call data of suspected persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X