వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతాడు, రాత్రిపూట ఇళ్ళలో దొంగతనాలు,ఎందుకంటే?

జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న నాగరాజు అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతూ రాత్రిపూట దొంగతనాలకు నాగరాజు పాల్పడేవాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :మద్యం తాగడం, జూదం ఆడడం లాంటి వ్యసనాలకు బానిసగా మారాడు.దీంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఉదయంపూట ఇడ్లీలు అమ్మడం, రాత్రిపూట దొంగతనాలుచేస్తూ జల్సాలకు డబ్బులను సంపాదిస్తున్నాడు. ఎట్టకేలకు పంజగుట్ట పోలీసులు ఈ దొంగను అరెస్టు చేశారు.

కర్నూల్ జిల్ల ఆళ్ళగడ్డకు చెందిన నాగరాజు పాత నేరస్థుడు. ఇతనిపై ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏడు కేసులున్నాయి. ప్రస్తుతం అమీర్ పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఇండ్లీ బండి నడుపుతున్నాడు.

police arrested a thief in hyderabad.nagaraju theft in gas agency, tyres showroom

ఉదయం నుండి రాత్రివరకు ఇడ్లీలు అమ్మడం, రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ళు, దుకాణాలకు షట్టర్లు పగులగొట్టి అందినకాడికి దోచుకోవడం నాగరాజుకు అలవాటు.

దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బును మద్యం తాగేందుకు జూదం ఆడేందుకు ఉపయోగించేవాడు. జల్సాల కోసమే ఈ డబ్బును ఉపయోగించుకొనేవాడు.
పంజగుట్ట ఠాణ పరిధిలోని ఇండేన్ గ్యాస్ దుకాణం, బ్రిడ్జిస్టోన్ టైర్ల దుకాణంలో రూ.1.30 లక్షలు చోరి చేశాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి నుండి బేగంపేట రైల్వేస్టేషన్ సమీపంలో మూడు తులాల బంగారు గొలుసు, రూజ1.30 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. నాగరాజుపై పిడి చట్టాన్ని నమోదు చేయాలని పోలీసులు ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు.

English summary
police arrested a thief in hyderabad.nagaraju theft in gas agency, tyres showroom
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X