హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంయుక్త ఆపరేషన్: సిగరెట్ దొంగలు దొరికారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడే ఆరుగురు సభ్యులున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను చిక్కడపల్లి పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మంగళవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.28 కోట్ల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కర్నాటకలోని బల్కీ జిల్లాకు చెందిన అల్లాషా(42) కొంత కాలంగా జాతీయ రహదారులపై దారిదోపిడీలకు పాల్పడుతున్నాడు. దీంతో ఇతనిపై కర్ణాటకలోని వివిధ పోలీసు స్టేషన్లతో పాటు బోయిన్ పల్లి పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మెదక్ జిల్లాలోని సదాశివపేట ఆయుధాల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.

ఇతని తమ్ముడు దస్తగిరి షా(32), రాధాకృష్ణ(32), సతీష్‌ అలియాస్‌ శంకర్‌(32), మహ్మద్‌ అర్షద్‌(19), సునీల్‌(30)లతో కలిసి అల్లాషా బృందంగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 6న అల్లాషా ముఠా పుణేలోని ఐటీసీ కంపెనీ కంటైనర్‌పై దాడిచేసి అందులోని 416 బాక్సుల సిగరెట్లను అపహరించారు.

స్థానికుల సాయంతో కంటైనర్‌ డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఐటీసీ కంపెనీ దోపిడీ పై ఫూణే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దొంగిలించిన సిగరెట్లను అల్లాషా రెండు డీసీఎంలలో పటాన్‌చెరుకు తరలించి హైదరాబాద్‌లో విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు.

తొలుత పటాన్ చెరువుకు వచ్చిన వీరు ఆ తర్వాత వీఎస్టీ క్రాస్ రోడ్డు వద్ద సిగరెట్లు అమ్మేందుకు బయలుదేరారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ వీరిపై ఇక్కడ కేసులు ఉండటంతో సిటీ పోలీసులు వీరిపై ఎప్పటినుంచో నిఘా ఉంచారు.

సిగరెట్ దొంగలు దొరికారు

సిగరెట్ దొంగలు దొరికారు

జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడే ఆరుగురు సభ్యులున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను చిక్కడపల్లి పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మంగళవారం పట్టుకున్నారు.

సిగరెట్ దొంగలు దొరికారు

సిగరెట్ దొంగలు దొరికారు

వారి వద్ద నుంచి రూ.3.28 కోట్ల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలోని బల్కీ జిల్లాకు చెందిన అల్లాషా(42) కొంత కాలంగా జాతీయ రహదారులపై దారిదోపిడీలకు పాల్పడుతున్నాడు.

సిగరెట్ దొంగలు దొరికారు

సిగరెట్ దొంగలు దొరికారు

దీంతో ఇతనిపై కర్ణాటకలోని వివిధ పోలీసు స్టేషన్లతో పాటు బోయిన్ పల్లి పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మెదక్ జిల్లాలోని సదాశివపేట ఆయుధాల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.

సిగరెట్ దొంగలు దొరికారు

సిగరెట్ దొంగలు దొరికారు

ఇతని తమ్ముడు దస్తగిరి షా(32), రాధాకృష్ణ(32), సతీష్‌ అలియాస్‌ శంకర్‌(32), మహ్మద్‌ అర్షద్‌(19), సునీల్‌(30)లతో కలిసి అల్లాషా బృందంగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు.

సిగరెట్ దొంగలు దొరికారు

సిగరెట్ దొంగలు దొరికారు

ఈ నెల 6న అల్లాషా ముఠా పుణేలోని ఐటీసీ కంపెనీ కంటైనర్‌పై దాడిచేసి అందులోని 416 బాక్సుల సిగరెట్లను అపహరించారు.

సిగరెట్ దొంగలు దొరికారు

సిగరెట్ దొంగలు దొరికారు

స్థానికుల సాయంతో కంటైనర్‌ డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఐటీసీ కంపెనీ దోపిడీ పై ఫూణే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దొంగిలించిన సిగరెట్లను అల్లాషా రెండు డీసీఎంలలో పటాన్‌చెరుకు తరలించి హైదరాబాద్‌లో విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు.

English summary
Police caught by cigarettes culprits in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X