వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ బాంబు కాల్: పరుగు, పోలీసుల టెన్షన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్ ఫాంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

స్టేషన్‌లోని కార్యాలయాలు, ప్లాట్ ఫాంలతోపాటు పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు జల్లెడ పట్టారు. చివరకు బాంబు లేదని నిర్దారణ అవడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఎవరో ఆకతాయి ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 2, 3 ప్లాట్ ఫాంలలో బాంబు పెట్టామని పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చాడు.

బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు

వేసవి సెలవులకు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసి ఉన్న సమయంలో బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు.

బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు

బాంబ్ స్క్వాడ్‌ను, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి రైల్వే భద్రతా సిబ్బంది మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహించడంతో ఏమి జరిగిందోననే భయాందోళన ప్రయాణికులలో నెలకొంది.

బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు

స్టేషన్‌లో బాంబు ఉందన్న విషయం తెలుసుకున్న కొందరు ప్రయాణికులు భయంతో స్టేషన్ నుంచి పరుగులు తీశారు. ప్రయాణికులకు సంబంధించిన బ్యాగ్‌లు, లగేజీ, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు

రెండు గంటల పాటు ఈ హడావుడి కొనసాగింది. బాంబు లేకపోవడంతో ఎవరో ఆకతాయి చేసినపనిగా పోలీసులు గుర్తించారు.

బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు

ఫోన్ నెంబరు ఆధారంగా ఆకతాయిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని భద్రతా సిబ్బంది తెలిపారు.

బాంబు బెదిరింపు

బాంబు బెదిరింపు

ఇలాంటి అకతాయిల వల్ల తమ సమయం వృథా కావడంతో పాటు ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని అధికారులు పేర్కొన్నారు.

English summary
police checking Baggage of Passengers after receiving Fake Bomb Call
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X