హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ 'నీరవ్': ఆ సాఫ్ట్‌వేర్‌తో చిక్కాడు!.., ఇదీ బ్యాంకులను ముంచిన చిట్టా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Credit Card Scam In Hyderabad Cracked

హైదరాబాద్: ఒక డబ్బా కంపెనీ సృష్టించి అందులో 41మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు ఫేక్ ఐడీలు కూడా సృష్టించి.. క్రెడిట్ కార్డులతో బ్యాంకులను బురిడీ కొట్టించిన కుంభం రంగారెడ్డి కేసులో పోలీసులు కీలక వివరాలు సంపాదించారు.

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి, ప్రమాదానికి కారణమదే?వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి, ప్రమాదానికి కారణమదే?

ఏయే బ్యాంకు నుంచి ఎంత తీసుకున్నది?, ఇందుకోసం ఎవరెవరిని వాడుకున్నది గుర్తించారు. నిందితుడి కూపీ లాగడంలో '360 డిగ్రీస్‌ వ్యూ' అనే సాఫ్ట్‌వేర్‌ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. గురువారం చిక్కిన ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో రెండు బ్యాంకులకు అధికారిక సమాచారం ఇచ్చేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది.

'ఫేక్' కంపెనీతో బ్యాంకులను ముంచేశాడు?: హైదరాబాద్‌లో ఘరానా మోసగాడు..'ఫేక్' కంపెనీతో బ్యాంకులను ముంచేశాడు?: హైదరాబాద్‌లో ఘరానా మోసగాడు..

 4బ్యాంకులు.. 80కార్డులు:

4బ్యాంకులు.. 80కార్డులు:

పర్ణిక నానో సొల్యూషన్‌ అనే డబ్బా కంపెనీని క్రియేట్ చేసిన రంగారెడ్డి.. అందులో 41మంది పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీలు సృష్టించాడు. నకిలీ ధ్రువ పత్రాలతో నాలుగు బ్యాంకుల ద్వారా 80కి పైగా క్రెడిట్ కార్డులు సంపాదించాడు.

 ఏ బ్యాంకు నుంచి ఎంత?:

ఏ బ్యాంకు నుంచి ఎంత?:

నకిలీ పత్రాలతో హెడ్‌డీఎఫ్‌సీ నుంచి 48 కార్డులు తీసుకుని రూ.45.72 లక్షలు, ఎస్బీఐ నుంచి 33 కార్డులు తీసుకుని రూ.25.29 లక్షలు, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ నుంచి 41 కార్డులు తీసుకుని రూ.77.9 లక్షలు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి 3 కార్డులు తీసుకుని రూ.3.26 లక్షలు రంగారెడ్డి డ్రా చేశాడు.

 బ్యాంకులకు లింక్ చేసిన నంబర్స్..:

బ్యాంకులకు లింక్ చేసిన నంబర్స్..:

లేని ఉద్యోగుల పేరిట నకిలీ ఐడీలు, ధ్రువపత్రాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన రంగారెడ్డి.. ఫోన్ నంబర్స్ విషయంలోనూ జాగ్రత్తపడ్డాడు. క్రెడిట్ కార్డు వాలిడిటీ ముగిసేవరకు ఉపయోగించుకుని.. ఆపై దానికి లింక్ చేసిన సిమ్ కార్డును పారేసేవాడు.

ఆ తర్వాత బ్యాంకు అధికారులు వీరిని సంప్రదించేందుకు ప్రయత్నించినా.. ఫోన్ నంబర్స్ పనిచేయవు. బ్యాంకులకు ఇచ్చిన చిరునామా కూడా తప్పని తేలి ఏమి చేయని పరిస్థితి.

 నేరస్తులు తెలివిమీరారు..:

నేరస్తులు తెలివిమీరారు..:

ఇటీవలి కాలంలో నేరస్తులు కూడా చాలా తెలివి మీరారు. కేసుల్లో బుక్ అయినప్పుడల్లా.. తమ పేరులోని స్పెల్లింగుల్లో మార్పులు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు.

ఉదాహరణకు నిందితుడి పేరు రామయ్య అనుకుంటే.. మొదటి సారి పట్టుబడినప్పుడు.. 'అయ్య'అనే పదాన్ని ఇంగ్లీషులో 'వైవైఏ'గా రాసి, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడైనా పట్టుబడితే 'ఐఏహెచ్'గా రాస్తున్నారు. అంతేకాదు, ఓసారి ఇంటి పేరును ముందుపెట్టి తమ పేర్లను వెనుకపెట్టడం.. మరోసారి తమ పేర్లను ముందు పెట్టి ఇంటిపేర్లను వెనుకపెట్టడం వంటివి చేస్తున్నారు.

 360డిగ్రీస్ సాఫ్ట్ వేర్:

360డిగ్రీస్ సాఫ్ట్ వేర్:

'360డిగ్రీస్ సాఫ్ట్ వేర్'తో నేరస్తులను గుర్తించడంలో పోలీసుల పని సులువవుతోంది. కుంభం రంగారెడ్డిని కూడా ఇదే సాఫ్ట్ వేర్ ఉపయోగించి గుర్తించారు పోలీసులు. ఈ సాఫ్ట్ వేర్ లో పాత నేరస్తులకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్, రేషన్‌కార్డ్, ఓటర్‌ గుర్తింపు కార్డుల వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి. పేర్లలో స్పెల్లింగులు మార్చుకున్నా దీని ద్వారా గుర్తించవచ్చు. అలాగే సదరు నేరస్తుల పేరుపై ఉన్న సిమ్ కార్డులు, వాహనాల వివరాలు కూడా ఇది అందిస్తుంది.

 కొరియర్ బాయ్స్‌ను మేనేజ్ చేసి:

కొరియర్ బాయ్స్‌ను మేనేజ్ చేసి:

బోగస్‌ వ్యక్తుల పేర్లు, నకిలీ చిరునామాలతో రంగారెడ్డి చేసిన గ్యాంగ్‌ క్రెడిట్‌కార్డుల మోసంలో 360డిగ్రీస్ ఆ వివరాలను వెలికితీసింది. క్రెడిట్ కార్డులు ఏ చిరునామాకు చేరాయో గుర్తించారు.

ఆ చిరునామా ఆధారంగా ఆరా తీస్తే.. నిజానికి అక్కడ క్రెడిట్ కార్డులు ఎవరూ దరఖాస్తు చేయలేదని తేలింది. లోతుగా విచారిస్తే.. రంగారెడ్డి ఇక్కడ కూడా ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

కొరియర్ బాయ్స్‌ను మేనేజ్ చేసి.. బ్యాంకులకు తాను ఇచ్చిన అడ్రసుల్లో కాకుండా నేరుగా తనకే అందేలా రంగారెడ్డి వ్యవహరించాడు. దీంతో కొరియర్ బాయ్స్‌కు కూడా నోటీసులు జారీ చేయాలని చూస్తున్నారు పోలీసులు.

అరుదైన నెలలోనే..

అరుదైన నెలలోనే..

2013-2015 మధ్య రెండేళ్ల పాటు బ్యాంకులను దోచుకున్న రంగారెడ్డి.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే రంగారెడ్డి తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో 2015 ఫిబ్రవరి 17న ఓ పోస్ట్‌ పెట్టారు. దీని ప్రకారం ఆ నెల అత్యంత అరుదైనదిగా అందులో పేర్కొన్నాడు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఫిబ్రవరి నెలలోనే పోలీసులకు చిక్కాడు. ఇన్నాళ్లు పుట్టగొడుగు రైతు ముసుగులో ఉన్నట్టు గుర్తించారు.

English summary
The city police have cracked a major fraud with usage of credit cards that was going on in the city for over five years and have arrested 10 persons in this connection. It is learnt that a fraud to the tune of Rs 1.5 crores has been done on four banks through the credit cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X