కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేకే వడ్డీకి రుణం, ఖాకీల వడ్డీ దందా: ఎవరీ మోహన్ రెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: అతనో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్. పేరు మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పేరు తెలంగాణ రాష్ట్రంలో మారుమోగిపోతోంది. ఏఎస్సైగా విధులు నిర్వర్తించే మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంతో ఎందరి జీవితాల్లోనో చిచ్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని విచారించేకొద్దీ నిజాలు బయటపడుతున్నాయి.

ఇతడితోపాటు చేతులు కలిపి అతడి వడ్డీ వ్యాపారంలో పాలుపంచుకున్న మరికొందరి పోలీసు అధికారుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇతడికి సహకరించినవారిని బదలీ చేస్తున్నారు. మోహన్ రెడ్డి వడ్డీ దెబ్బకు గత నెల 29న కరీంనగర్ కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తతో ఇతడి వ్యవహారంపై కేసు నమోదైంది.

మోహన్ రెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే వారు తమ వివరాలను తెలియజేయాలని ఉద్యమ సంస్థ లోక్ సత్తా పిలుపునివ్వడంతో బుధవారం నాడు పదుల సంఖ్యలో బాధితులు మోహన్ రెడ్డి దురాగతాలను వెల్లడించారు.

 Police danda: Who is Mohan reddy?


కాగా, ఆదాయం పన్ను శాఖ అధికారులు మోహన్ రెడ్డి ఆదాయం, ఆస్తులపై తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటకు వచ్చాయి. మొన్నీమధ్యనే విడుదలైన ఓ చిత్ర నిర్మాతకు మోహన్ రెడ్డి రూ. 40 లక్షలు అప్పు ఇచ్చినట్లు తేలిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే చాలామంది నిర్మాతలకు అప్పులు ఇచ్చి వారి వద్ద నుంచి భూములు జిపిఎ చేయించుకునేవాడని తెలుస్తోంది.

మోహన్‌రెడ్డి అక్రమంగా నిర్వహించిన ఫైనా న్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సంబంధమున్న కేవలం 18 మంది పోలీసు అధికారుల పేర్లే బ యటకు వచ్చాయనీ, ఇంకా చాలా మంది భాగస్వాములు ఉన్నారనీ, బాధితులకు న్యాయం జరగాలంటే కేసు పరిశోధన సక్రమంగా జరగాలనీ, ఇది సీఐడీతో సాధ్యం కాదని లోకసత్తా ఉద్యమ సంస్థ నాయకులు వివరించారు.

సీబీఐ లేదంటే హైకోర్టు పర్యవేక్షణలో పనిచేసే స్పెషల్ టీంతో మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బాధ్యులెవరనేది తేలేందుకు అవసరమైతే మోహన్ రెడ్డి, అతని అనుచరులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని లోకసత్తా ఉద్యమ సంస్థ సంస్థ జిల్లా బాధ్యులు ఎన్ శ్రీనివాస్, ప్రకాశ్‌హొల్లా, కేసీ రెడ్డి, ఆర్ చంద్రప్రభాకర్, టీ గంగారాం, కేఎస్ నారాయణ, గంగాధర్, ముజఫర్, రాంచంద్రారెడ్డి తదితరలు కోరారు.

40 మంది బినామీలను, వసూళ్లకు తిరిగిన 20 మందిని, ముఖ్యం గా అకౌంటెంట్‌గా పనిచేసిన జ్ఞానేశ్వర్‌ను వెం టనే అదుపులోకి తీసుకుని విచారించాలనీ, హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోహన్‌రెడ్డి బినామీల పేర్లతో ఉన్న భూ ములపై ఆరాతీయాలనీ, అవి కనీసం రూ.300 కోట్లదాకా విలువజేస్తాయనీ, అగ్రహారం వద్ద పాలిటెక్నిక్ కళాశాల పక్కన ఉన్న 178 ఎకరాల భూమి వివరాలపై సీఐడీ అధికారులు వివరాలు సేకరించాలనీ, అవన్నీ పోలీసు అధికారులు, వారి బినామీలవేనని పేర్కొన్నారు.

English summary
It is said that ASI Mohan Reddy has harassed so many people lending money. Karimnagar ASI Mohan Reddy arrested and remanded till Novermber 27th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X