వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీత దాటితే వేటే..!ఇంటికే ఈ ఛలాన్లు పంపిస్తామంటున్న పోలీసులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రూల్స్ బ్రేక్ చేసే వాహన దారులపై పోలీసులు వినూత్న రీతిలో కొరడా ఝుళిపించబోతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతూ ఇష్టారాజ్యంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారుల నుంచి పోలీసులు నేరుగా జరిమానా వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలికారు. నూతన విధానంతో నేరుగా ఈ చలాన్‌ ఇంటికి పంపించి జరిమానను మీసేవలో కట్టిస్తున్నారు. ఈ చలాన్‌ విధానంతో ట్రాఫిక్‌ నియంత్రణ సులువు అవుతుందని పోలీసులు చెప్పుకొస్తున్నారు. రోడ్లపై ఇష్టాను సారంగా ప్రయాణించి పోలీసు వద్ద ఉన్న కెమెరాలకు చిక్కితే వారం రోజుల్లో నేరుగా ఈ చలాన్‌ ఇంటికి వస్తుంది. ఆర్‌ సర్వర్‌ అనుసంధానం చేసిన పోలీస్‌ అప్లికేషన్‌ సిబ్బంది తీసిన వాహనం ఫోటోను ఆప్‌లోడ్‌ చేయగానే వాహనదారుడి వివరాలన్ని డిస్‌ప్లే అవుతాయి. అనంతరం వారం రోజుల్లో ఈ చలాన్‌ నిబంధనలు ఆతిక్రమించిన వాహనదారుడి ఇంటికి ఈ -చలాన్‌ వెళ్తుంది. ఫలితంగా జరిమాన చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పుకొస్తున్నారు.

పెరుగుతున్న హెల్మెట్‌ వాడకం..! ఇంకా బద్దకిస్తున్న నగర వాసులు..!!

పెరుగుతున్న హెల్మెట్‌ వాడకం..! ఇంకా బద్దకిస్తున్న నగర వాసులు..!!

ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌ ధరించకపోవడంతోనే ప్రాణ నష్టం జరుగుతుంది. నగరానికి చెందిన పలువురు హెల్మెట్‌ ధరించక చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు చాల ఉన్నాయి. పోలీసులు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గతంలో అనేక సార్లు రోడ్డు భద్రత-హెల్మెట్‌ వాడకంపై అవగహన కార్యక్రమాలు నిర్వహించిన పెద్దగా వాహనదారుల్లో మార్పు రాలేదు, అయితే గత నెల రోజుల నుంచి ఈ చలాన్‌ విధానంపై ప్రజలకు అవగహన కల్పించి నిబంధనలు పాటించని వాహనదారులకు ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా పోలీసులు తమకు కేటాయించిన ట్యాబ్‌ల ద్వారా సదరు వాహనం దారుడికి ఈ-చలాన్‌ విధిస్తున్నారు.

గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!! గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!

జరిమానాలు నేరుగా ఇంటికే..! అతిక్రమిస్తే అంతే మరి అంటున్న పోలీసులు..!!

జరిమానాలు నేరుగా ఇంటికే..! అతిక్రమిస్తే అంతే మరి అంటున్న పోలీసులు..!!

నేరుగా ఇంటికి జరిమాన వస్తుండడంతో తప్పిని సరిగా జరిమాన కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో భద్రతతో పాటు ఫైన్‌ నుంచి తప్పించుకోవడం కోసం హెల్మెట్‌ వాడకంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని గ్రహించిన వాహనదారులు స్వచ్చందగానే హెల్మెట్‌ వాడుతున్నారు.కాగ గ్రామంలో పోలాల వద్దకు పోయే సందర్భాలలో ఫైన్‌లు విధించవద్దని వాహనదారులు కొరుతున్నారు.

మద్యం తాగి నడిపితే కఠిన చర్యలే..! వాహనం సీజ్.. జైలు జీవితమే..!!

మద్యం తాగి నడిపితే కఠిన చర్యలే..! వాహనం సీజ్.. జైలు జీవితమే..!!

హెల్మెట్‌ వాడకంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తుడడంతో మందు బాబులు బెంబేలెత్తిపోతున్నారు.మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే భారీగా జరిమానతో పాటు కొన్ని సందర్భాలలో కోర్టులు జైలు శిక్ష విధిస్తున్నాయి. దీంతో వాహనదారుల్లో క్రమేపి మార్పు వస్తుందని పోలీసులు చేప్తున్నారు. వాహనాదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలతో పాటు జరిమానల బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

ప్రజల రక్షణ కోసమే నిబంధనలు..!హెల్మెట్‌ వాడకం ఎంతో మేలు..!!

ప్రజల రక్షణ కోసమే నిబంధనలు..!హెల్మెట్‌ వాడకం ఎంతో మేలు..!!

ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలి.రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి.ప్రమాదాలు నివారించేందుకే కృషి చేస్తున్నామంటున్నారు పోలీసులు. ప్రజలు భారంగా బావించద్దని, మైనర్లకు సైతం వాహనాలు ఇవ్వద్దని, మైనర్ల వాహనాలు ఇవ్వడం ద్వారా ప్రమాదాలను కొనితెచ్చుకున్నవారు అవుతారని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్నప్తి చేస్తున్నారు. ద్విచక్రవాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్‌ వాడాలని, దీని వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు రక్షణగా కల్పిస్తుందని ప్రల్లో చైతన్యం తీసుకొస్తున్నారు పోలీసులు.

English summary
Police have come to an end with a direct penalty charge from motorists who drive on the roads as well as motorists who drink alcohol. With the new policy, the challan is sent directly to the house and the fine is served. Police say traffic control is easier with this challan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X