వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుధాకర్ రెడ్డి హత్య: రాజేష్ అరెస్టుపై సందిగ్ధం, ఆ చిక్కుతో తలపట్టుకున్న పోలీసులు?..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వాతి చేసిన పనికి ఆమె కుటుంబ సభ్యులు తలెత్తుకోలేకపోతున్నారు. కూతురు చనిపోయిందని భావిస్తూ కన్న తండ్రే గుండు కొట్టించుకుని మరీ కర్మకాండ నిర్వహించారు.

Recommended Video

రాజేష్ ఆత్మహత్యాయత్నం, అంతా వాట్సాప్ నే ! స్వాతి కేసులో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

అటు అత్తింటివారు, సన్నిహితులు.. ఇలా అందరూ స్వాతిని ఛీ అంటున్నవారే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే స్వాతి కడతేర్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చి పడింది.

 ఆసుపత్రి బిల్లులు:

ఆసుపత్రి బిల్లులు:

యాసిడ్ దాడి జరిగి అల్లుడిని ఆసుపత్రిలో చేర్చినట్లు కుమార్తె స్వాతి సమాచారం అందించగానే ఆమె తండ్రి లింగారెడ్డి హుటాహుటిన హైదరాబాద్ పరుగెత్తుకొచ్చారు. ఆసుపత్రి బిల్లుల నిమిత్తం రూ.5లక్షలు ఆయనే భరించారు. కానీ.. ఆసుపత్రి బెడ్ మీద ఉన్నది అల్లుడు కాదని, రాజేష్ అనే మరో వ్యక్తి అని తెలిశాక అతని గుండె పగిలిపోయింది. డబ్బు పోయిందన్న బాధ ఆయనకు లేదు కానీ కూతురే అల్లుడిని హతమార్చిందని తెలిసి తట్టుకోలేకపోయాడు.

 అరెస్టుకు రంగం సిద్దం:

అరెస్టుకు రంగం సిద్దం:

చికిత్స పొందుతున్న వ్యక్తి సుధాకర్‌రెడ్డి అని నమ్మించడానికి స్వాతి ఆడిన డ్రామా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. దీంతో అటు స్వాతి కుటుంబం, ఇటు అత్తింటివారు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయేవారు. స్వాతి పోలీసుల అదుపులో ఉంది. స్వాతి నేరం అంగీకరించడంతో రాజేష్ అరెస్టుకు రంగం సిద్దమైనా.. ఆసుపత్రిలో పెండింగ్ బిల్లుతో అసలు చిక్కు వచ్చి పడింది.

 పెండింగ్ బిల్లు రూ.2లక్షలు:

పెండింగ్ బిల్లు రూ.2లక్షలు:

అల్లుడి కోసం ఖర్చు పెడుతున్నానని స్వాతి తండ్రి లింగారెడ్డి రూ.5లక్షలు ఖర్చు చేయగా.. కొడుకు కోసం చేస్తున్నామని సుధాకర్ రెడ్డి కుటుంబం రూ.1.60లక్షల దాకా ఖర్చు చేసింది. అసలు నిజం తెలిశాక వారంతా స్వాతిపై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెండింగ్ బిల్లు చెల్లిస్తేనే రాజేష్ ను ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లు ఎవరు చెల్లిస్తారో.. ఎవరి చేత చెల్లించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు.

ఆరోజే కొడుకు పుట్టిన రోజు: అంతా వాట్సాప్!, రాజేష్ ప్రవర్తన ఇలా.. సుధాకర్ హత్యలో మరిన్ని కోణాలుఆరోజే కొడుకు పుట్టిన రోజు: అంతా వాట్సాప్!, రాజేష్ ప్రవర్తన ఇలా.. సుధాకర్ హత్యలో మరిన్ని కోణాలు

 చెల్లిస్తేనే డిశ్చార్జ్

చెల్లిస్తేనే డిశ్చార్జ్

రాజేష్ ను డిశ్చార్జ్ చేస్తే.. తమకు రావాల్సిన బకాయిలు రావని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి తమ బిల్లులు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని, ఆ తర్వాతే అరెస్టు చేసుకోవాలని చెబుతున్నాయి. దీంతో పోలీసులకు ఎటూ తోచడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా? అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్నారు.

ఏం జరిగి ఉంటుంది?: సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి.. భార్యను నిర్బంధించి..ఏం జరిగి ఉంటుంది?: సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి.. భార్యను నిర్బంధించి..

English summary
Police facing a problem to arrest Rajesh in Sudhakar Reddy murder case, hospital management clearly said that Rajesh will be discharge after paying the bills only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X