హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీఐపీల ఒత్తిడి, ఆదేశాలు: వారికి చుక్కలు చూపిస్తున్న బాహుబలి

బాహుబలి 2 సినిమా పోలీసులకు చుక్కలు చూపిస్తోందంటున్నారు. బాహుబలి సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలయి రికార్డు కలెక్షన్లు సాధించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాహుబలి 2 సినిమా పోలీసులకు చుక్కలు చూపిస్తోందంటున్నారు. బాహుబలి సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలయి రికార్డు కలెక్షన్లు సాధించింది.

వేయి కళ్లతో..

వేయి కళ్లతో..

ఈ సినిమా కోసం అందరూ వేయి కళ్లతో ఎదురు చూశారు. టిక్కెట్ ధరలు ఆకాశాన్ని కూడా అంటాయి. సినిమా విడుదలయి వారం అవుతున్నా బాహుబలి మానియా తగ్గలేదు. థియోటర్లు ఫుల్ అవుతున్నాయి.

పోలీసులకు బాహుబలి ఇబ్బందులు

పోలీసులకు బాహుబలి ఇబ్బందులు

వీఐపీలు కూడా బాహుబలి సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కొంతమంది పోలీసులకు ఇబ్బందులు తెస్తోందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి హీట్ మరింత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

టిక్కెట్ల కోసం..

టిక్కెట్ల కోసం..

రాజకీయ నాయకుల వంటి విఐపీలు ఈ సినిమాను మల్టీ ప్లెక్స్‌లలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. వారు తమకు టిక్కెట్ల కోసం పోలీసుల పైన ఆధారపడుతున్నారని తెలుస్తోంది.

పదుల సంఖ్యలో టిక్కెట్లు

పదుల సంఖ్యలో టిక్కెట్లు

బాహుబలి టిక్కెట్ల కోసం వీఐపీలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ టిక్కెట్లు ఒకటో రెండో కాదు.. పది ఇరవై అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో ఈ ఒత్తిడి మరీ ఎక్కువ ఉందంటున్నారు.

ఆదేశాలు కూడా

ఆదేశాలు కూడా

మరో విషయం ఏమంటే తమకు పలానా షోకు, ఇన్ని టిక్కెట్లు కావాలని పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నారని అంటున్నారు. ఏ నాయకుడి నుంచి ఫోన్ వస్తుందో.. ఎన్ని టిక్కెట్లు తెమ్మంటారోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.

పెద్ద హీరోల సినిమాలకు కామన్ కానీ..

పెద్ద హీరోల సినిమాలకు కామన్ కానీ..

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు వీఐపీలు సినిమాలు చూడటం, అందుకోసం టిక్కెట్ల కోసం పోలీసులపై ఒత్తిడి తీసుకు రావడం సహజమేనని, కానీ బాహుబలి సినిమాకు అది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని అంటున్నానారు. బాహుబలి ఒత్తిడి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలలోని పోలీసులపై ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
It is said that Some VIPs from Andhra Pradesh and Telangana are pressuring police for Bahubali tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X