వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్ ల మీద ట్విస్ట్: ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో గజ్వేల్ ఏసీపీపై కేసు

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. బ్యూటీషీయన్ శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని ఈ విషయం బయటకు తెలిసి పరువు పోతోందనే భయంతో ఆత్మహత్య చేసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. బ్యూటీషీయన్ శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని ఈ విషయం బయటకు తెలిసి పరువు పోతోందనే భయంతో ఆత్మహత్య చేసుకొన్నాడని ఇప్పటివరకు పోలీసులు ప్రకటించారు.అయితే ఈ వాదనతో ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఏకీభవించడం లేదు. ఇదిలా ఉంటే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంచలనం: 'ప్రభాకర్ రెడ్డిది హత్యే, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు'?. సంచలనం: 'ప్రభాకర్ రెడ్డిది హత్యే, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు'?.

బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుల విషయంలో రెండు కుటుంబాలకు చెందిన కుటుంబసభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ట్విస్ట్: ఆ సమాచారమే రాజీవ్ కొంపముంచిందా, శిరీషను 'ఎర'గా వేశాడా?ట్విస్ట్: ఆ సమాచారమే రాజీవ్ కొంపముంచిందా, శిరీషను 'ఎర'గా వేశాడా?

వీరిద్దరివి ఆత్మహత్యలు కావు. హత్యలేననే అనుమానాలను వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసు ప్రభాకర్ రెడ్డికి లింకు చేస్తున్నారని ఆరోపించారు కుటుంబసభ్యులు.

చనిపోయిన ప్రభాకర్ రెడ్డిపై బురదచల్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. బ్యూటీషీయన్ శిరీష కేసుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు వివరిస్తున్న పోలీసులు ప్రభాకర్ రెడ్డి కేసు విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై కేసు నమోదు

గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై కేసు నమోదు

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించి వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గిరిధర్ ను ఏ1 గా చేర్చారు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఏసీపీ గిరిధర్ ప్రధాన కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఆ క్వార్టర్ లోకి వెళ్ళిన ఏసీపీ గిరిధర్ ఆ గదిలోని కొన్ని కాగితాలను మాయం చేశారని కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభాకర్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

మామూళ్ళకోసం వేధించారా?

మామూళ్ళకోసం వేధించారా?

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని మామూళ్ళు ఇవ్వాలంటూ గజ్వేల్ ఏసీపీ గిరిధర్ వేధించేవాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రతి నెల 80 వేల రూపాయాలు మామూలు ఇవ్వాలని ఏసీపీ గిరిధర్ ప్రభాకర్ రెడ్డిని వేధించాడని , తాను ఇవ్వలేనని ప్రభాకర్ రెడ్డి గిరిధర్ కు చెప్పాడని కుటుంబసభ్యులు మీడియాకు వివరించారు. దీంతో ప్రభాకర్ రెడ్డిని వేధింపులకు గురిచేశారని వారు ఆరోపిస్తున్నారు.

 బదిలీ చేసుకోవాలని ప్రయత్నించి ఆత్మహత్య

బదిలీ చేసుకోవాలని ప్రయత్నించి ఆత్మహత్య

బ్యూటీషీయన్ శిరీష కేసును కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు లింక్ చేయడాన్ని ఆయన కుటుంబసభ్యులు మొదటినుండి తప్పుపడుతున్నారు. చనిపోయిన వ్యక్తిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ప్రభాకర్ రెడ్డిని హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తాజగా మంగళవారం నాడు ఇదే విషయమై ప్రభాకర్ రెడ్డి సతీమణి రచనా మీడియాతో మాట్లాడి పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి పోస్ట్ మార్టమ్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అయితే ఏసీపీ గిరిధర్ వేధింపులు ఎక్కువ కావడంతో ప్రభాకర్ రెడ్డి బదిలీ చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే నెల రోజుల తర్వాత బదిలీ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని కుటుంబసభ్యులు అంటున్నారు. అయితే అదే సమయంలో ఆయన చనిపోవడం పట్ల కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాకర్ రెడ్డి పోస్ట్ మార్టమ్ నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదు

ప్రభాకర్ రెడ్డి పోస్ట్ మార్టమ్ నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదు

ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు విషయమై పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శిరీష ఆత్మహత్య కేసును సంబంధించి పోస్ట్ మార్టమ్ నివేదికను బయటపెట్టిన పోలీసులు ప్రభాకర్ రెడ్డి కేసుకు సంబంధించి ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తునే ఆమె తప్పుబట్టారు. అయితే ఎట్టకేలకు గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై కేసు నమోదు చేశారు.

English summary
Police filed a case on Gajwel ACP Giridhar for kukunoorpally si prabhakar reddy suicide case.Si Prabhakar Reddy brother bhasker reddy complaint against ACP Giridhar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X