వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు : మరోసారి రవిప్రకాశ్‌కు నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ 9 సంస్థలో అవకతవకలు, సీఎస్ సంతకం ఫోర్జరీ తదితర కేసులపై మాజీ సీఈవో రవిప్రకాశ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఇప్పటికే రెండుసార్లు రవిప్రకాశ్ కు నోటీసులు జారీచేసిన స్పందించకపోవడంతో ... మరోసారి ఇస్యూ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ 41ఏ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు.

కౌశిక్ కంప్లైంట్

టీవీ 9 భాగస్వామి అలంద మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాల వివాదం నెలకొంది. దీంతో అలంద సంస్థ డైరెక్టర్ పీ కౌశిక్ రావు .. రవిప్రకాశ్ పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. దీనిపై రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ, మాజీ సీఎఫ్ వో మూర్తి పై కేసు నమోదు చేశారు.

police gave notice to ravi prakash

మూర్తి ఒక్కరే ..
కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్, శివాజీ, మూర్తికి నోటీసులు జారీచేశారు. మూర్తి విచారణకు హాజరవుతున్నారు. కానీ రవిప్రకాశ్, శివాజీ గైర్జాజరవుతున్నారు. మరోసారి విచారణకు రావాలని ఆదివారం కూడా నోటీసు ఇచ్చారు. రెండోసారి కూడా రవిప్రకాశ్ రాకపోవడంతో ... ఇవాళ మరోసారి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు. 15న కూడా రాకుండే కఠిన చర్యలు తప్పదని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. రవిప్రకాశే కాదు శివాజీ కూడా విచారణకు హాజరుకావడం లేదు. ఆయన ఆజాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. శివాజీకి కూడా పోలీసులు నోటీసులు జారీచేశారు. అయినా వీరు స్పందించకుంటే చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

గడువివ్వండి ..
మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడే తనకు 10 రోజుల గడువు కావాలని రవిప్రకాశ్ న్యాయవాది పోలీసులను కోరారు. అయినా కేసు తీవ్రత దృష్ట్యా వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఉండదని ... విచారణకు హాజరుకావాలని పోలీసులు స్పష్టంచేశారు. ఇప్పటికే సోమవారంతో సహా మూడుసార్లు నోటీసులు జారీచేశారు.

English summary
Former CEO Ravi Prakash has been issued by the police once again for alleged irregularities in TV9 and case signing for forgery. Having already responded to the notices issued twice, Ravi Prakash has once again proved that he is once again. Cyberabad police issued notices under the CrPC 41A to appear before the court on June 15 at 11 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X