వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nagol Firing Case: యాక్టివా, రెడ్ టీ షర్టే పట్టించింది.. నాగోలు గోల్డ్ చోరీ కేసులో నిందితుల అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నాగోల్‌‌‌ కాల్పులు, గోల్డ్‌‌‌‌ చోరీ కేసులో ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేందర్‌‌‌‌‌‌‌‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ టైంలో ముఠాలోని ఓ సభ్యుడు వేసుకున్న రెడ్​ షర్ట్, హోండా యాక్టివానే ఆధారంగా
నిందితులను గుర్తించారు. దోపిడీ మహేందర్ తో సహా 10 మంది ప్లాను చేశారు. ఇందులో పోలీసులు ఆరుగుని అరెస్ట్ చేశారు.

2.7 కిలోల బంగారం

2.7 కిలోల బంగారం

నిందితుల నుంచి రూ.1.35 కోట్లు విలువ చేసే 2.7 కిలోల బంగారం, 3 కంట్రీమేడ్‌‌‌‌ పిస్టల్స్, 25 లైవ్‌‌‌‌ రౌండ్స్, ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌, పెల్లట్స్, పల్సర్‌‌‌‌, హోండా యాక్టివా, మహేంద్ర జీప్‌‌‌‌, 6 సెల్​ఫోన్స్, రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
రాజస్థాన్‌ కు చెందిన మహేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు వచ్చి బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. రెడీమేడ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ ఆర్నమెంట్స్‌‌‌‌ తయారు చేయించి మార్కెట్‌‌‌‌ చేసేవాడు.

పథకం ప్రకారం

పథకం ప్రకారం

వ్యాపారంలో కలిసిరాకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. భార్య గుదియా, బావమరిది సుమీర్‌ చౌదరి , మహ్మద్‌ ఫిరోజ్‌, సిద్దిపేట్‌‌‌‌ జిల్లా కొండపాకలో షాప్స్ నిర్వహిస్తున్న రాజస్తాన్​ వ్యాపారులు మనీశ్​ వైష్ణవ్, రితీశ్ వైష్ణవ్, మెదక్ జిల్లా రామాయంపేట్‌‌‌‌లో క్లాత్ షోరూమ్ నిర్వహిస్తున్న బన్సీరామ్‌‌‌‌తో కలిసి బంగారం దోపిడీ చేయాలని పథకం వేశారు.

కంట్రీమేడ్‌‌‌‌ పిస్టల్స్,

కంట్రీమేడ్‌‌‌‌ పిస్టల్స్,

హర్యానాలో కంట్రీమేడ్‌‌‌‌ పిస్టల్స్, ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్, డాగర్‌‌‌‌‌‌‌‌ కొన్నారు. బేగంబజార్, సికింద్రాబాద్‌‌‌‌లోని రెడీమేడ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ ఆర్నమెంట్స్‌‌‌‌ తయారీ షాపులు, సప్లయ్ చేసే వారిని గుర్తించి వారిని ఫాలో చేశారు. డిసెంబరు 1న మాన్య, బన్సీరామ్‌ స్కూటర్‌పై పాట్‌ మార్కెట్‌ వద్ద రెక్కీ ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి 3 కిలోల బంగారం ఉన్న సంచితో తన దుకాణం నుంచి బయలుదేరాడు. అతన్ని వీరిద్దరు వెంబడించారు. మిగతా వారు దారి మధ్యలో వారికి జత కలిశారు.
రాజ్‌కుమార్‌ రాత్రి 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో నాగోల్‌లోని మహదేవ్‌ జువెలరీలోకి వెళ్లారు. కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లారు.

స్కూటీ

స్కూటీ


సుమిత్‌‌‌‌ డాగర్‌‌‌‌‌‌‌‌, మనీశ్, మన్య అక్టోబర్‌‌‌‌‌‌‌‌లోనే సిద్దిపేట వచ్చారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 26న సిద్దిపేట జిల్లా గౌరారం పీఎస్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో హోండా యాక్టివాపై వెళ్తున్న వ్యక్తిని పిస్టల్‌‌‌‌తో బెదిరించి దాన్నిస్కూటీని లాక్కున్నారు. ఆ స్కూటీని ఓ ట్రావెల్‌‌‌‌ బస్‌‌‌‌లో రాజస్థాన్ కు పంపారు. హర్యానా వెళ్లి మళ్లీ నవంబర్​ 20న యాక్టివాతో మెదక్‌‌‌‌ జిల్లా రామాయంపేట్‌‌‌‌ తిరిగొచ్చారు. 29న గజ్వేల్‌‌‌‌లోని బజాజ్ షోరూమ్‌‌‌‌లో పల్సర్‌‌‌‌ బైక్ కొన్నారు. పల్సర్ తో పాటు హోండా యాక్టివా‌‌‌పై డిసెంబర్​ 1న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ మోండా మార్కెట్‌‌‌‌కు వచ్చారు. ఈ కేసులు నిందితులను గుర్తించాడనికి ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజీ ఉపయోగపడింది.

English summary
The police have finally arrested the accused in the shooting and gold theft case. Mahender, the main accused in this case, has been detained by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X