వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసుల గాలింపు .. ఇంతకీ రవి ప్రకాష్ ఎక్కడ ?

|
Google Oneindia TeluguNews

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌‌, శివాజీల కోసం ఇంకా పోలీసులు గాలింపు చేస్తూనే వున్నారు. వాటాలు, ఫోర్జరీ, నిధుల మళ్లీంపు తదితర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. మొదట ఏపీలో ఉన్నారని, తర్వాత బెంగుళూరు, గుజరాత్ ల మధ్య తిరుగుతున్నారని పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు.

ఎమ్మెల్యేగా ఓడి నక్క తోక తొక్కిన కిషన్ రెడ్డి .. ఏకంగా కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశంఎమ్మెల్యేగా ఓడి నక్క తోక తొక్కిన కిషన్ రెడ్డి .. ఏకంగా కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం

 రవి ప్రకాష్ ఏపీని వీడి బెంగుళూరు, గుజరాత్ లలో తిరుగుతున్నారని సమాచారం .. పోలీసుల గాలింపు

రవి ప్రకాష్ ఏపీని వీడి బెంగుళూరు, గుజరాత్ లలో తిరుగుతున్నారని సమాచారం .. పోలీసుల గాలింపు

తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు 160 సీఈర్‌పీసీ సెక్షన్ కింద రవిప్రకాశ్‌కు నోటీసులిచ్చారు.అయితే వాటికి సరైన విధంగా స్పందించకపోవడంతో 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద మరోసారి నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినా రవి ప్రకాష్ మాత్రం ఇప్పటివరకు పోలీసుల ముందుకు రాలేదు . అయితే ఏపీలోని ఓ రిసార్ట్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడి నుంచి రవిప్రకాశ్ బెంగుళూరు వెళ్ళారని సమాచారం అందింది .. తర్వాత గుజరాత్ వెళ్లారనే సమాచారంతో అక్కడా పోలీసులు తనిఖీలు చేశారు.తాజాగా మళ్లీ బెంగళూరుకు చేరుకున్నారన్న సమాచారంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడ ఉన్నారో పోలీసులకు అంతు చిక్కటం లేదు. రవి ప్రకాష్, శివాజీలను పట్టుకోవటంలో తెలంగాణా పోలీసులు విఫలం అయ్యారు అన్న టాక్ వినిపిస్తుంది.

దొరకకుండా ఉండేందుకు జాగ్రాతలు తీసుకుంటున్న రవి ప్రకాష్ .. పోలీసులు పట్టుకుంటారా ?

దొరకకుండా ఉండేందుకు జాగ్రాతలు తీసుకుంటున్న రవి ప్రకాష్ .. పోలీసులు పట్టుకుంటారా ?

టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన నాటి నుండి అంటే ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు. ఇక సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నా పోలీసులు పట్టుకోవటంలో విఫలం అవుతున్నారు . ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో, వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అసలు రవి ప్రకాష్ ఎక్కడ ? తెలంగాణా పోలీసులకు సవాల్ గా మారిన రవి ప్రకాష్, శివాజీల అరెస్ట్

అసలు రవి ప్రకాష్ ఎక్కడ ? తెలంగాణా పోలీసులకు సవాల్ గా మారిన రవి ప్రకాష్, శివాజీల అరెస్ట్

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ రవిప్రకాశ్ ఇటీవల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇక రవి ప్రకాష్ వీడియో పై తాజా టీవీ 9 యాజమాన్యం కౌంటర్ ఇచ్చింది. ఇక రవిప్రకాశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు రవి ప్రకాష్ . ఏది ఏమైనా తెలంగాణా పోలీసులకు పట్టుబడకుండా రవి ప్రకాష్, శివాజీలు సవాల్ విసురుతున్నారు. అసలు రవి ప్రకాష్ ఎక్కడ తల దాచుకున్నరనేది మాత్రం ఇప్పుడు తెలంగాణా పోలీసులకు అంతు చిక్కని ప్రశ్నలా వుంది.

English summary
The police have been searching for TV9's former CEO Ravi Prakash and Shivaji. TV9 former CEO Ravi Prakash who is facing allegations on forgery, money laundering has been rampant by police. But so far he has not been able to find out. The police are conducting a three state searching , in the first phase they thought they are in AP and then later police men searched between Bangalore and Gujarat. The police started to search in TV9's office since 9th of this month, he has been changing two to three sims per day, police said. Police sources also found that he was talking only through WhatsApp calls via WiFi to keep his track out. Till now the police couldnot find out the address of these two and the are searching to catch TV9 former CEO Raviprakash and Shivaji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X