వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్ లమీద ట్విస్ట్ లు: నరేష్ వద్ద మరోఫోన్, ట్రాక్ చేస్తే స్నేహితుడి ఆచూకీ దొరికేనా?

సంచలనం సృష్టించిన అంబోజి నరేష్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కేసులో అరెస్టైన స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యాలను దొరకకుండా ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. నరేష్ ఉపయోగించిన మ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనం సృష్టించిన అంబోజి నరేష్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కేసులో అరెస్టైన స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యాలను దొరకకుండా ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. నరేష్ ఉపయోగించిన మరో సెల్ ఫోన్ ను ఉపయోగించాడని పోలీసులకు విచారణలో తేలింది.ఈ ఫోన్ ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

ప్రేమించి పెళ్ళిచేసుకొన్న నరేష్, స్వాతిల కథ విషాదంగా ముగిసింది. అయితే స్వాతి ఆత్మహత్య చేసుకోగా, నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడు.

అయితే తొలి నుండి ఈ కేసులో అనేక మిస్టరీగానే ఉన్నాయి. అయితే పోలీసులు వ్యవహరించిన తీరు కూడ విమర్శలపాలైంది. పోలీసులు సక్రమంగా వ్యవహరిస్తే ప్రేమికుల ప్రాణాలు దక్కేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

అయితే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎట్టకేలకు చర్యలు తీసుకొన్నారు. కానీ, నరేష్ ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేయకపోతే పోలీసులు స్పందించికపోయి ఉండేవారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

నరేష్ కు రెండో సెల్ ఫోన్ కూడ ఉంది

నరేష్ కు రెండో సెల్ ఫోన్ కూడ ఉంది

నరేష్ ను హత్యచేసిన తర్వాత సాక్ష్యాలను దొరకకుండా ఉండేందుకుగాను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు.నరేష్ స్నేహితుడు ఈ కేసులో కీలకంగా మారాడు.అయితే ఆ స్నేహితుడు ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేదు.అయితే ఈ సమయంలో నరేష్ మరో సెల్ ఫోన్ ను కూడ వాడినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ను ట్రాక్ చేస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.ఈ ఫోన్ కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు.

విచారణలో ఆసక్తికర విషయాలు

విచారణలో ఆసక్తికర విషయాలు

నరేష్ హత్య తర్వాత అతడి బ్యాగ్ ను శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో గుర్తించారు పోలీసులు.జ్యూడిషీయల్ రిమాండ్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి, బంధువు సత్తిరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడని సమాచారం. నరేష్ కు మరో సెల్ ఫోన్ కూడ ఉందని శ్రీనివాస్ రెడ్డి విచారణలో వెల్లడించారు.అయితే హత్య చేసిన తర్వాత నరేష్ మొదటి ఫోన్ ను మౌలాలిలో ధ్వంసం చేశారు. అయితే రెండో ఫోన్ ను ఆ తర్వాత గుర్తించారు నిందితులు.

పోన్ ను కాల్చేసి పారేశారు

పోన్ ను కాల్చేసి పారేశారు


నరేష్ ను తలపై కొట్టిన సమయంలోనే ఆయన జేబులో ఉన్న వీడియోకాన్ ఫోన్ కిందపడిపోయింది.అయితే ఈ ఫోన్ ను వారు గుర్తించలేదు. నరేష్ దగ్గర దొరికిన ఒక్క ఫోన్ ను తీసుకెళ్ళి మౌలాలివద్ద ధ్వంసం చేశారు.అయితే నరేష్ ను కాల్చేసిన ప్రాంతం వద్దకు ఉదయాన్నే వెళ్ళి చూసిన శ్రీనివాస్ రెడ్డికి అక్కడే పడిపోయిన వీడియోకాన్ ఫోన్ కన్పించింది. ఆ ఫోన్ ను కాల్చేశారు. సమీపంలో ఉన్న పాడుబడిన ఇంట్లో పారేశారు. ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకొన్నారు.

రెండో ఫోన్ గురించి తెలియదన్న కుటుంబసభ్యులు

రెండో ఫోన్ గురించి తెలియదన్న కుటుంబసభ్యులు

నరేష్ రెండో ఫోన్ గురించి తమకు తెలియదని కుటుంబసభ్యులు చెప్పారు. అయితే ఈ ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఈ ఫోన్ ను ట్రాక్ చేస్తే నరేష్ తో పాటు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చిన స్నేహితుడి వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఆ స్నేహితుడు ఎవరో తెలిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదు.

English summary
police identified second phone of Naresh. police trying to track this phone. srinivas reddy and his relative satti reddy told this phone information
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X