• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోలీసుకు ముద్దు పెట్టిన వ్యక్తిపై కేసు..!

|

హైదరాబాదు: బోనాల సందర్భంగా హైదరాబాదులో ఓ యువకుడు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి విధి నిర్వహణలో ఉన్న మహేందర్ అనే ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ను గట్టిగా కౌగలించుకుని ముద్దు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఇన్స్‌పెక్టర్ మహేందర్ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో తనను ముద్దుపెట్టిన యువకుడిపై కేసు పెట్టారు. తను విధి నిర్వహణలో ఉండగా ఓ వ్యక్తి తనను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు . అంతేకాదు తన విధులకు కూడా అడ్డు తగిలాడని అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన విధులకు అడ్డుగా నిలిచిన వ్యక్తిని భానుగా గుర్తించారు. తక్షణమే తనపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఫిర్యాదు చేశారు.

ఆషాఢ మాసం బోనాల చివరి అంకంలో ఈ ముద్దు ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపులో భాగంగా డప్పు వాయిద్యాల చప్పుళ్లకు డ్యాన్సులు చేస్తూ కొందరు యువకులు రోడ్డుపై డ్యాన్సులు చేస్తున్నారు. ఆ క్రమంలో విధి నిర్వహణలో భాగంగా అటువైపు నడుచుకుంటూ వెళుతున్న ఇన్‌స్పెక్టర్ మహేందర్ ‌ను ఓ యువకుడు దగ్గరగా వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని సదరు పోలీస్ ఆఫీసర్ తేరుకునే లోపే ముద్దు కూడా పెట్టేశాడు. ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడో అంతే బందోబస్తుగా ముద్దు కూడా ఇచ్చాడు.

kiss man

బోనాల సందర్భంగా మందేసి చిందు వేయడం కామన్. ఆ క్రమంలో మత్తులో ఉన్న సదరు యువకుడు పోలీస్ ఆఫీసర్‌కు ముద్దు పెట్టాడు. అసలు ఆ యువకుడి ఉద్దేశం పోలీస్ ఆఫీసర్ తమతో కలిసి ఓ స్టెప్పు వేస్తారని ఆశించి అలా చేశాడేమో. అయితే సదరు పోలీసాయన తేరుకుని లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. అయినా కూడా ఆ యువకుడు బెదరలేదు. పోలీస్ ఆఫీసర్‌ను తప్పించుకుంటూ నెమ్మదిగా స్టెప్పులేసుకుంటూ అలా అలా వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

English summary
The police inspector who was hugged and kissed by a young man during the procession of Bonalu, had filed a case against the young man in Nallakunta police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X