వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.110 కోట్లు:తప్పుడు పత్రాలతో బ్యాంకుల్లో ఇలా, తాఖీదులు అలా..

ముసద్దీలాల్ యజమాన్యం తప్పుడు డ్యాక్యుమెంట్లలో రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.110 కోట్ల రూపాయాలను జమ చేసిన వ్యవహరంపై సహకరించిన పది జ్యూయల్లరీ దుకాణాల యజమానులకు నోటీసులు పంపారు పోలీసులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ముసద్దీలాల్ జ్యుయల్లర్స్ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది రోజు రోజుకో కొత్త వ్యక్తి పేరును పోలీసులు విచారణలో కనుగొంటున్నారు. ఈ కేసులో సుమారు 40 మందివరకు నిందితులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. మరో పదిమంది బంగారు షాపుల యజమానులకు పోలీసులు తాజాగా నోటీసులు పంపారు.

పెద్ద నగదునోట్ల రద్దుతో బంగారం వ్యాపారులు రద్దుచేసిన నగదును తప్పుడు డ్యాక్యుమెంట్లను సృష్టించి బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేశారు.

ముసద్దీలాల్ జ్యుయలరీ యజమానిని తొలుత అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తే రోజుకో కొత్త వ్యక్తి పేరు వెలుగుచూస్తుండడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

ముసద్దీలాల్ యజమాని ఆయన ఇద్దరు కొడుకులు నితిన్ గుప్తా, నిఖిలేష్ గుప్తాలను అరెస్టు చేసిన తర్వాత ఇంకా కొందరి పేర్లు బయటకు వచ్చాయి.ఈ కేసులో 40 మంది పేర్లు బయటకు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.

 తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకుల్లో నగదు జమ

తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకుల్లో నగదు జమ

ముసద్దీలాల్ జ్యుయల్లర్స్ యజమానులు రెండు బ్యాంకుల్లో రూ.110 కోట్ల జమ చేశారు. అయితే నీల్ సుందర్ ధారాట్,బాలాజీ గోల్డ్ యాజమాన్యానివే ఎక్కువ నిధులు ఉన్నాయని సిసిఎస్ పోలీసులు ఆధారాలు సేకరించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నీల్ సుందర్ ధారాట్ ముసద్దిలాల్ జ్యుయలర్స్ ఎండి నితిన్ గుప్తాకు పోణ్ చేసి నల్లధనాన్ని మార్చే ప్రణాళికను వివరించాడు.నితిన్ ఇందుకు సరేనన్నాడు. తన బంధువైన బాలాజీ గోల్డ్ యాజమాన్యంతో కూడ ఆయన మాట్లాడాడు. ముగ్గురూ కలిసి ఈ ప్రణాళికను అమలు చేశారు.

ప్రణాళికను ఇలా అమలు

ప్రణాళికను ఇలా అమలు

బంగారు, వజ్రాభరణాలను కిలోల కొద్ది విక్రయించేందుకు అనుమతి ఉన్న సుందర్ లాల్ ధారాట్ తన స్నేహితులు, జ్యూయలర్స్ యజమానులు మొత్తం 15 మంది నుండి రూ40 కోట్ల విలువైన ఐదువందలు, వెయ్యి రూపాయాలను సేకరించాడు. మరో వైపు బాలాజీ గోల్డ్ యజమానికి రూ.50 కోట్ల నల్లధనాన్ని సన్నిహితులు, జ్యూయల్లర్స్ యజమానులు 20 మంది నుండి తీసుకొన్నారు. ముసద్దీలాల్ జ్యూయలర్స్ యజమాని రూ.12 కోట్లు జమ చేశారు. మరో రూ.8 కోట్లను ముసద్దీలాల్ ఆర్థిక వ్యవహరాలు పర్యవేక్షించే వారి నుండి తీసుకొని రూ.110 కోట్లను నల్ల ధనాన్ని వేర్వేరు చోట్ల దాచారు. గత ఏడాది నవంబర్ 10,11 తేదిల్లో ముసద్దీలాల్ ఖాతాల్లో ఈ నగదును జమ చేశారు.

ఇద్దరు నిందితులుపరారీలో

ఇద్దరు నిందితులుపరారీలో

ముసద్దీలాల్ జ్యుయల్లర్స్ అక్రమాల్లో భాగస్వామ్యులైన మరో ఇద్దరు నిందితులు పారిపోయారని పోలీసులు గుర్తించారు. నితిన్ గుప్తా బ్యాంకు ఖాతాల నుండి కోటి రూపాయాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇంకో ఖాతాను కూడ సిసిఎస్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఖాతాలో కూడ కోటి రూపాయాలు ఉన్నట్టు తెలుస్తోంది.

పది మంది జ్యూయల్లర్స్ యజమానులకు నోటీసులు

పది మంది జ్యూయల్లర్స్ యజమానులకు నోటీసులు

ముసద్దీలాల్ జ్యూయల్లర్స్ యజమానులకు సహకరించిన కేసులో పదిమంది బంగారు దుకాణాల యజమానులకు సిసిఎస్ పోలీసులు నోటీసులు పంపారు. పెద్ద నగదు నోట్లను ముసద్దీలాల్ యజమానులకు ఇచ్చారు. తెరవెనుక ఉన్నవారికి కూడ పోలీసులు నోటీసులు జారీ చేవారు.

కోట్లలో లాభం కోసం వక్రమార్గం

కోట్లలో లాభం కోసం వక్రమార్గం

340 కిలోల బంగారు ఆభరణాల కొనుగోలు, విక్రయాల లావాదేవీల్లో రూ.10 కోట్ల వరకు నితిన్ గుప్తా లాభం పొందారని పోలీసులు చెబుతున్నారు.ఈ లాభాల్లోనే మూడు కోట్ల రూపాయాలను ముందస్తుగా ఆధాయపు పన్నును చెల్లించారు.అయితే నితిన్ గుప్తా చెప్పిన వివరాల ఆధారంగా విచారిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.అయితే నోటీసులు పంపిన జ్యూయల్లరీస్ యజమానులను విచారించిన తర్వాత నిందితులా కాదా అనేది తేల్చనున్నట్టు సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి చెబుతున్నారు.

English summary
police issued notice to ten jewellery shop owners for deposited currency with fake documents.musaddilal jewellers deposited 110 crores in banks. police arrested musaddilal owner and directors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X