వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..! ఇంటర్ బోర్డ్ ముందు ఉాద్రిక్తం..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR ఇలాకాలో మరో విద్యార్థిని బలి... జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..! || Oneindia Telugu

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై నిరసన తెలపుతూ జనసేన పార్టీ సోమవారం ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాగా నేడు ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి కార్యకర్తలు వచ్చిన వేళ పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్న వేళ వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను తరలించే ప్రక్రియలో భాగంగా పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని పోలీసులు చెప్పుకొస్తున్నారు.

Police lathi charge for Janasena activists.!tension in front of INTER BOARD.!!

కాగా, తమపై లాఠీ చార్జ్ చేయడాన్ని శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులను చూసి తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకూ తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో ఇంటర్ బోర్డు ముట్టడికి తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్, కార్యకర్తలు ప్రయత్నించారు. జనసేన నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొనడంతో నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అరెస్టు చేసిన నాయకులను గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

English summary
The JanaSena Party called on the interim board invasion Monday to protest against the irregularities in interference. The party activists were heavily reaching the inter-board office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X