హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్ను త్వరగా కాల్చండి, రాజకీయం కోసమే, విక్రమ్ పక్కా ప్లాన్‌తో: పోలీసులు చెప్పిన వివరాలివీ

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. విక్రమ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేస్తామని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ బుధవారం వెల్లడించారు. విక్రమ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేస్తామని తెలిపారు. విక్రమ్ పక్కా ప్లాన్ ప్రకారం కథ నడిపారన్నారు.

విక్రమ్ అరెస్ట్, కానీ, ఇదీ ఆస్తి లెక్క!: కాల్పులు డ్రామానా తెలియదే.. భార్య షిఫాలి, హంగామావిక్రమ్ అరెస్ట్, కానీ, ఇదీ ఆస్తి లెక్క!: కాల్పులు డ్రామానా తెలియదే.. భార్య షిఫాలి, హంగామా

ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని నేరస్తులుగా గుర్తించామని, ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. విక్రమ్ గౌడ్‌తో కలిపి ఆరుగురు అరెస్టయ్యారని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో నిందితులను గాలించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పుల కేసును వినియోగించుకొని అటు ఆర్థిక వ్యవహారాలు చక్కపెట్టుకోవడం, ఇటు రాజకీయంగా సానుభూతి పొందడమే అతని లక్ష్యంగా కనిపించిందని పోలీసులు తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనే

ఎన్నికల్లో పోటీ చేయాలనే

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతోనే విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నాడని తెలిపారు. ఇలా చేస్తే సానుభూతి ఓట్లు సంపాదించవచ్చునని అతని ఆలోచన అని చెప్పారు. ఎన్నికల కోసమే హత్యాయత్నం నాటకం ఆడారన్నారు. తర్వాత శత్రువులు తనపై కాల్పులు జరిపారని కథ అల్లాడని తెలిపారు.

Recommended Video

Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills
కాల్పుల డ్రామా కోసం రూ.50 లక్షల ఒప్పందం

కాల్పుల డ్రామా కోసం రూ.50 లక్షల ఒప్పందం

కాల్పుల డ్రామా కోసం విక్రమ్ గౌడ్ రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు నెలల క్రితమే కాల్పులపై ప్లాన్ వేశారని చెప్పారు. ఎవరెవరు ఏం చేయాలనే దానిని ముందే ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. ప్రసాద్ అనే స్నేహితుడి ద్వారా విక్రమ్ గౌడ్‌కు గోవింద రెడ్డి పరిచయమయ్యాడని చెప్పారు. గోవింద రెడ్డి ద్వారా నందు పరిచయమయ్యాడని తెలిపారు.

మిత్రుల ద్వారా రయీస్‌ను సంప్రదించారు

మిత్రుల ద్వారా రయీస్‌ను సంప్రదించారు

ప్లాన్ ముందుకు తీసుకు వెళ్లేందుకు గోవింద రెడ్డికి రూ.5 లక్షలను విక్రమ్ గౌడ్ ఇచ్చారని చెప్పారు. అలాగే, అతనికి సినిమా అవకాశాలు కూడా ఇప్పిస్తానని చెప్పారు. గోవింద రెడ్డి ద్వారా విక్రమ్ గౌడ్‌కు పరిచయమైన నందు.. తన మిత్రులతో కలిసి ఇండోర్‌లోని రయీస్‌ను సంప్రదించాడు. రయీస్ ఖాన్ షార్ప్ షూటర్.

రూ.30 వేలకు తుపాకి కొనుగోలు, త్వరగా కాల్పులు జరపాలని ఒత్తిడి

రూ.30 వేలకు తుపాకి కొనుగోలు, త్వరగా కాల్పులు జరపాలని ఒత్తిడి

జూలై 6వ తేదీన నిందితులు ఇండోర్ వెళ్లారని చెప్పారు. అక్కడ
తుపాకీని, తూటాలను రూ.30 వేలకు కొనుగోలు చేశారని చెప్పారు. జూలై 8న విక్రమ్ గౌడ్ చేతికి తుపాకీ వచ్చిందన్నారు. జూలై 17న విక్రమ్ గౌడ్ పుట్టపర్తి వెళ్లారని తెలిపారు. తన చేతికి తుపాకీ వచ్చినప్పటి నుంచి కాల్పులు జరిపాలని తాను ఒప్పందం కుదుర్చుకున్న వారిపై విక్రమ్ గౌడ్ ఒత్తిడి తెచ్చాడన్నారు.

మూడు రౌండ్ల కాల్పులు జరపండి

మూడు రౌండ్ల కాల్పులు జరపండి

తనపై మూడు రౌండ్ల కాల్పులు జరపాలని విక్రమ్ గౌడ్ వారికి సూచించారని చెప్పారు. ప్లాన్‌లో భాగంగా రూ.30 వేలు పెట్టి బైక్ కొన్నారు. బైక్ ఇంజిన్, ఛాసిస్ నెంబర్లు నిందితులు చెరిపేశారని తెలిపారు. హెల్మెట్ కూడా విక్రమ్ గౌడే వారికి ఇచ్చాడని చెప్పారు. తన భార్య షిఫాలి లేదా వాచ్‌మెన్ వస్తే బెదిరించడానికి మరో రౌండ్ కాల్పులు జరపమని చెప్పాడని తెలిపారు.

21న కలిశారు, 26న కాల్చాలని నిర్ణయం

21న కలిశారు, 26న కాల్చాలని నిర్ణయం

ఈ నెల 21వ తేదీన నిందితులందర్నీ విక్రమ్ గౌడ్ కలిశారు. ఆ రోజే ప్లాన్ ఎలా చేయాలనేది నిర్ణయించారని చెప్పారు. ఈ నెల 26వ తేదీన కాల్చాలని తొలుత నిర్ణయించారని చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఉదయం విక్రమ్ గౌడ్ మరోసారి నిందితులను తన ఇంట్లో కలిశారని చెప్పారు. ఏ దారిన పారిపోవాలో వారికి రెండుసార్లు చెప్పాడని, అలాగే తుపాకీ ఎక్కడ పడవేయాలో చెప్పాడన్నారు.

తన కారులోనే ఇంటికి తీసుకు వచ్చాడు

తన కారులోనే ఇంటికి తీసుకు వచ్చాడు

సంఘటన జరిగిన రోజు విక్రమ్ గౌడ్ తన కారులోనే నిందితులను ఇంటి వరకు తీసుకు వచ్చాడని తెలిపారు. అపోలో ఆసుపత్రి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌లో నిందితులు బస చేశారని చెప్పారు. రయీస్‌ను షేక్ అహ్మద్ పిలిపించారన్నారు. ప్లాన్ ప్రకారమే రయీస్ కాల్పులు జరిపి, ఆ తర్వాత బైక్ పైన పారిపోయారని తెలిపారు.

English summary
Police press meet on Former Minister Mukesh Goud's son Vikram Goud's firing incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X