హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘బుల్లెట్లా ఎలా ఉంటాయ్, తుపాకీ చూడనే లేదు’: విచారణలో విక్రమ్ తిక్క సమాధానాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనేక మలుపులు తిరిగిన మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కేసు విచారణలో షాకింగ్ సమాధానాలు పోలీసులకు ఎదురవుతున్నాయి. అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు తన తండ్రి, మామలను బెదిరించేందుకు విక్రమ్ గౌడ్ తనపై తానే సుపారీ ఇచ్చి కాల్పులు జరిపించుకున్న విషయం తెలిసిందే.

తిక్క సమాధానాలు..

తిక్క సమాధానాలు..

కాగా, విక్రమ్ గౌడ్‌ను ఒక రోజుపాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన్నుంచి ఎలాంటి ప్రశ్నలకూ సమాధానం రాబట్టలేకపోయినట్లు సమాచారం. తుపాకీ ఎక్కడ కొన్నారు?, కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో మూడింటిని వాడగా.. మిగతావి ఎక్కడ? వంటి ప్రశ్నలకు విక్రమ్ గౌడ్ తిక్క సమాధానాలు చెప్పినట్లు పోలీసుల వర్గాల ద్వారా తెలిసింది.

Recommended Video

Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills
పోలీసుల సహనాన్ని పరీక్షించిన విక్రమ్..

పోలీసుల సహనాన్ని పరీక్షించిన విక్రమ్..

‘బుల్లెట్లా అవి ఎలా ఉంటాయి?.. తుపాకీని నేను జీవితంలో చూడలేదు!' అంటూ పోలీసుల సహనాన్ని విక్రమ్ గౌడ్ పరీక్షించినట్లు సమాచారం. దీంతో విక్రమ్ గౌడ్ ను మరోసారి కస్టడీకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మిగతా బుల్లెట్లను ఎక్కడ దాచారన్న విషయాన్ని తేల్చేందుకు మరోసారి ఆయన ఇంటికి సోదాలకు వెళ్లి పోలీసులు ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారు.

సూటిగా సమాధానం చెప్పలేదు..

సూటిగా సమాధానం చెప్పలేదు..

పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ విక్రమ్ గౌడ్ సూటిగా సమాధానం చెప్పకపోవడంతో ఆయన్నుంచి ఎంతో సమాచారం సేకరిస్తామనుకున్న పోలీసులకు నిరాశ ఎదురైంది. విక్రమ‌ను బుధవారం ఉదయం 10గంటలకు జైలు నుంచి తీసుకుని వచ్చిన పోలీసులు సాయంత్రం 4గంటల్లోపే తిరిగి జైలుకు పంపించారు.

కాలయాపనే..

కాలయాపనే..

ఈ సమయంలో విచారణకు విక్రమ్ గౌడ్ సహకరించకపోవడంతో పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విక్రమ్ గౌడ్ కాలయాపన చేశాడని ఓ పోలీసు అధికారి చెప్పారు. దీంతో విక్రమ్ గౌడ్‌ను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.

English summary
The City Police on Wednesday questioned Congress leader Vikram Goud in connection with the self staged 'attempt to murder' case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X