హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవ్ పార్టీలో నో కారోనా! మద్యం మత్తులో చిందులేసిన యువతీయువకులు: చివరికి కటకటాల వెనక్కి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో కరోనా నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీ జరిగింది. పుట్టినరోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించిన ఓ పాంహౌస్‌పై పోలీసులు దాడి చేశారు. మద్యం మత్తులో చిందులేస్తున్న యువతీయువకులను పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు.

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ..

ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ..


రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని భరత్ ఫాంహౌస్‌లో శనివారం సాయంత్రం సమయంలో సుమారు 70 మంది యువతీయుకులు చేరుకున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో మద్యం తాగి విచ్చలవిడిగా చిందులేస్తూ హంగామా సృష్టించారు. హైదరాబాద్ కు చెందిన వరుణ్.. ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహించాడు. ఇక ఆర్గనైజర్లుగా జాశన్ ఖాన్, అన్వేష్ వ్యవహరించారు. మద్యం, విందు, చిందలేస్తూ ఎంజాయ్ చేశారు.

తాగిన మైకంలో యువతీయువకుల హంగామా..

తాగిన మైకంలో యువతీయువకుల హంగామా..

తాగిన మైకంలో వాళ్లు చేసిన హంగామాకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలిసింది. ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో విచ్చలవిడిగా చిందులేస్తేన్న యువతీయువకులు పోలీసులను చూసి షాకయ్యారు. ముఖాలు దాచుకున్నారు.

కటకటాల వెనక్కినెట్టిన పోలీసులు

కటకటాల వెనక్కినెట్టిన పోలీసులు


రేవ్ పార్టీకి అనుమతించిన భరత్ ఫాంహౌస్ యజమానితోపాటు ఆర్గనైజర్లు, పార్టీకి వచ్చిన యువతీయువకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేస్తున్న సమయంలోనే.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీలు నిర్వహించడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

తెలంగాణలో లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు..

తెలంగాణలో లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు..

తెలంగాణలో లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, సామూహిక కార్యక్రమాలకు, పెద్ద ఎత్తున జనం గూమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు కూడా తక్కువ మందికే అనుమతిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిబంధనలు లెక్కచేకుండా రేవ్ పార్టీలు నిర్వహిస్తూ బాధ్యత లేకుండా వ్యవహరించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడికి ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

English summary
police raids on rave party held in a farm house in ranga reddy district: 70 arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X