హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో షాక్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదారబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత చిక్కుల్లోపాడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. 41సీఆర్సీ కింద నోటీసులు జారీ అయ్యాయి.

Recommended Video

అధికారంలోకి వచ్చాక దెబ్బకు దెబ్బ: రేవంత్ రెడ్డి

<strong>భారీగా డబ్బు తీసుకున్నట్లు అంగీకారం: జగ్గారెడ్డిపై 8సెక్షన్ల కింద కేసులు, 25 వరకు రిమాండ్</strong>భారీగా డబ్బు తీసుకున్నట్లు అంగీకారం: జగ్గారెడ్డిపై 8సెక్షన్ల కింద కేసులు, 25 వరకు రిమాండ్

2001నాటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. 15రోజుల్లోగా విచారణకు హాజరై సమాధానం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి సహా 13మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

police sends a notice to revanth reddy on Jubilee Hills housing society case

ఈ నోటీసులకు రేవంత్ స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని, ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు. కాగా, ఈ కేసు వివరాల్లోకి వెళితే.. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణలు రేవంత్ రెడ్డిపై ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్ట్ కావడం, మరో నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

English summary
Hyderabad Police sent a notice to Congress leader Revanth Reddy on Jubilee Hills housing society case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X