వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్‌దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగాయి. అనంతరం ఓట్ల లెక్కించారు. టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచారు.

టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచిన సర్పంచ్‌లు 2580 మందికి పైగా గెలిచారు. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన అభ్యర్థులు దాదాపు 900 మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీ (దాదాపు 70), సీపీఎం (దాదాపు 32), టీడీపీ (దాదాపు 30), సీపీఐ (20), ఇతరులు (దాదాపు 750) ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు చాలా తక్కువ మెజార్టీతో గెలుస్తారు. ఒక్క ఓటుతో గెలిచే వారు కూడా ఉంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి 1 ఓటుతో గెలుపొందారు. అయితే ఆశ్చర్యకరమై విషయం ఏమంటే సదరు అభ్యర్థి, అతని సతీమణి ఓటు వేయలేదట. తమకు ఓటు వేయాలని అందర్నీ అభ్యర్థించిన వాళ్లే తమ ఓటు తాము వేసుకోలేదట. దీంతో ప్రత్యర్థి ఒక్క ఓటుతో గెలిచారు. వీరిద్దరు ఓటు వేసుకుంటే గెలిచేవారు.

Polling results for first phase of Telangana Panchayat election

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతున్నాయి. ఈ రోజు తొలి విడత జరిగింది. మొదటి విడతలోని 769 పంచాయతీలు ముందే ఏకగ్రీవం అయ్యాయి. 3701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 28,976 వార్డులకు 70,094 మంది పోటీ చేశారు.

English summary
This is the first ever polls for panchayats after the formation of the Telangana state in 2014. Polling began at 7 a.m and ended at 1 p.m. TRS supported candidates won in major villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X