ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మతో పొంగులేటి భేటీ - సీన్ ఛేంజ్ : పార్టీ..ముహూర్తం ఫిక్స్..!?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. పార్టీ మార్పు వేళ ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడు చర్చల్లో నిలిచారు. బీఆర్ఎస్ ను దాదాపు బయటకు వచ్చేసారు. ఏ పార్టీలో చేరాలనే దాని పైన తర్జన భర్జన పడుతున్నారు. బీజేపీలో ఖాయం అని అందరూ భావించారు. ఇంతలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. తేల్చుకొనే లోగా గత పరిచయాలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చక్రం తిప్పారు. పొంగులేటితో చర్చించారు. గతంల వైఎస్సార్సీపీలో పని చేసిన పొంగులేటికి ఆ కుటుంబపై అభిమానం ఉంది. తాజాగా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇక నిర్ణయానికి వచ్చేసారు. పార్టీలో చేరిక..ముహూర్తం దాదాపు ఫిక్స్ అయ్యాయి. తన నిర్ణయం పై అనుచరలతో సమవేశానికి పొంగులేటి సిద్దమయ్యారు.

విజయమ్మతో పొంగులేటి భేటీతో...

విజయమ్మతో పొంగులేటి భేటీతో...


పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా జిల్లాలో తన హవా కొనసాగాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సిద్దమయ్యారు. తొలుత బీజేపీలో చేరాలని భావించారు. కానీ, కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లు గా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టు చిక్కటం ఖాయమని శ్రేయోభిలాషులు సూచించారు. వామపక్ష..కాంగ్రెస్..గులాబీ పార్టీకే అక్కడ ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటూ సర్వే నివేదికలు స్పష్టం చేసాయి. దీంతో..విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలతో భేటీ అయ్యారు. జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో..అక్కడ మినహా ఇతర నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతు దారులకు సీట్లు ఇచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే బాగుంటుందని షర్మిల సూచించారు. నిర్ణయం మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తాజాగా విజయమ్మ తో భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు చేసారు.

నాడు అన్నతో - నేడు చెల్లితో..

నాడు అన్నతో - నేడు చెల్లితో..


విజయమ్మతో భేటీ తరువాత పొంగులేటి రాజకీయ అడుగులు ఏంటనేది స్పష్టత వచ్చింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటుగా మూడు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి గెలుపొందారు. ఇప్పుడు వైఎస్సార్టీపీ ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో షర్మిల అదే జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం ఆ కుటుంబంతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో..ఇప్పుడు తన అనుచరులకు ఈ పార్టీ ద్వారా టికెట్లు దక్కించుకోవటం పైన చర్చలు చేసారు. కాంగ్రెస్ లో కొంత ఓట్ బ్యాంక్ కలిసి రావటంతో పాటుగా వైఎస్సార్ ఇమేజ్.. తమకు వ్యక్తిగతంగా ఉన్న మద్దతు కలిసి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవచ్చని లెక్కలు వేసారు. పాలేరు లో షర్మిల గెలుపుకు సహకరించేందుకు పొంగులేటి విజయమ్మ తో భేటీలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..నాడు జగన్ తో కలిసి వైసీపీలో..నేడు షర్మిలతో కలిసి వైఎస్సార్టీపీలో పొంగులేటి పని చేయటం ఖాయమని చెబుతున్నారు.

8న పాలేరుకు విజయమ్మ..అక్కడే చేరే ఛాన్స్

8న పాలేరుకు విజయమ్మ..అక్కడే చేరే ఛాన్స్

ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరికపై వరుస మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నెల 8 న పాలేరు లో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. అదే రోజున పొంగులేటి వైఎస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. తనతో పాటుగా అనుచరులను పార్టీలో చేర్చేలా మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ రోజు చేరటమా లేక షర్మిల పాదయాత్ర ముగింపు సభలో చేరటమా అనేది చర్చ జరిగింది. పాలేరులో విజయమ్మ - షర్మిల సమక్షంలోనే చేరేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి మాత్రం ఈసారి భారీ స్కెచ్‌తోనే రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. వీరందరినీ ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది.రి..పొంగులేటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఏం జరుగుతుందనేది త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
Ex MP Ponguleti Srinivasa Reddy likely to join in YSRTP on 8th of this month in presence of YS Vijayammma at Paleru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X