వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: 'సుష్మాస్వరాజ్‌ను అవమానించిన మోడీ', జైఆంధ్రా.. కవితపై కోదండరాం ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi Blaming Sushma Swaratj Says Former MP

హైదరాబాద్: నాడు తలుపులు వేసి రాష్ట్ర విభజన చేశారన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రధానిపై శుక్రవారం విమర్శలు గుప్పించారు.

మోడీ కోరుకున్నవారే యుద్ధానికి సిద్ధం: రంగంలోకి పవన్ కళ్యాణ్, జేపీతో భేటీమోడీ కోరుకున్నవారే యుద్ధానికి సిద్ధం: రంగంలోకి పవన్ కళ్యాణ్, జేపీతో భేటీ

తలుపులు వేసి విభజన చేశారని మోడీ చెబుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారని నిలదీశారు. వారు నిరసన ఎందుకు వ్యక్తం చేయలేదన్నారు. మౌనంగా ఉండటం, వారు మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు.

ప్రధానిని ప్రశ్నిస్తే సీబీఐ విచారణ

ప్రధానిని ప్రశ్నిస్తే సీబీఐ విచారణ

తలుపులు వేసి విభజన చేశారని ప్రధాని మోడీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించలేదని పొన్న నిలదీశారు. ఆ వ్యాఖ్యలపై నిలదీస్తే సీబీఐ విచారణ చేయిస్తారని భయమా అని ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందించాలన్నారు.

 సుష్మను అవమానించిన మోడీ

సుష్మను అవమానించిన మోడీ

విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కూడా సహకరించిందని పొన్నం గుర్తు చేశారు. తలుపులు వేసి విభజించారని చెప్పడం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సుష్మా స్వరాజ్‌ను ప్రధాని మోడీ అవమానిస్తున్నారని మండిపడ్డారు.

 కవితపై కోదండరాం ఆగ్రహం

కవితపై కోదండరాం ఆగ్రహం

తెలంగాణకు ఉన్న సమస్యలు వదిలేసి పక్క రాష్ట్రాల సమస్యలపై స్పందించడం విడ్డూరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఎంపీ కవితను ఉద్దేశించి అన్నారు. ఆమె గురువారం లోకసభలో ఏపీ వైసీపీ, టీడీపీ ఎంపీల ఆందోళనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

కవిత అందుకే జై ఆంధ్రా అన్నారు

కవిత అందుకే జై ఆంధ్రా అన్నారు

రేణుకా చౌదరిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మోడీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ప్రధాని మాట్లాడిన తీరుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పార్లమెంటులో కవిత మాట్లాడిన తీరు బాగా లేదన్నారు. రాజకీయ కోణంలో ఆమె మాట్లాడారని, సెటిలర్ల ఓట్ల కోసం కవిత చివరగా జై ఆంధ్రా అన్నారని విమర్శించారు.

English summary
Congress leader and Former MP Ponnam Prabhakar on Friday said that PM Narendra Modi blaming Sushma Swaratj with his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X