హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివెల్Xపోర్క్ ఫెస్టివెల్: సీఎంలకు సహా ఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్‌కు కౌంటర్‌గా ఫోర్క్ ఫెస్టివెల్ తెరపైకి వచ్చినట్లుగా కనిపిస్తోంది! ఈ నెల పదవ తేదీన తాము పోర్క్ ఫెస్టివెల్ నిర్వహిస్తామని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికే బీఫ్ ఫెస్టివెల్‌కు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రపంచ మానవ హక్కుల దీనోత్సవం రోజున.. మానవ హక్కులను పరిరక్షించుకునేందుకు తాము బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తున్నామని బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించే విద్యార్థులు చెబుతున్నారు. తాము దాదాపు పదివేల మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పారు.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీఫ్ ఫెస్టివెల్ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీహార్ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులను ఆహ్వానిస్తున్నామన్నారు.

Pork festival to be held in Osmania University

రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీ నేతలను, అలాగే భారతీయ జనతా పార్టీ నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఎవరికి ఇష్టమైన ఆహారాన్ని వారు తీసుకునే హక్కు ఉందని చెప్పారు.

మరోవైపు, పోర్క్ ఫెస్టివెల్ జరిపేందుకు మరికొందరు విద్యార్థులు ముందుకు వచ్చారు. తాము పందికూర పండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది బీఫ్ ఫెస్టివెల్‌కు పోటీ కాదని చెప్పారు. తమ పండుగ తమదే అన్నారు. ఇది సంచాల జాతుల పండుగ అన్నారు.

తాము అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తామని చెప్పారు. బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తాము రుచికరమైన పంది మాంసాన్ని అందరికీ వడ్డిస్తామని చెప్పారు.

English summary
While the OU beef festival controversy rages on, another festival has been planned in OU which might evoke unpleasant reactions from some sections of people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X