• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

|

హైదరాబాద్: ప్రముఖ నటి పూనమ్ కౌర్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవలి సంఘటనల నేపథ్యంలో ఆమె ఆవేదనను వెళ్లగక్కినట్లుగా కనిపిస్తోంది. ఇష్టారీతిన ఆరోపణలు చేసేవారికి బుద్ధి చెప్పేలా ఆ ట్వీట్ ఉందని భావిస్తున్నారు.

పూనమ్‌ను లాగి తప్పులో కాలు: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

సాధారణ మహిళల కంటే పోర్న్ స్టార్‌నే ఎక్కువ గౌరవిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రూత్ (నిజం) అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆమె ఈ ట్వీట్ చేశారు.

 పోర్న్ స్టార్ చాలా గౌరవింపబడుతుందంటూ..

పోర్న్ స్టార్ చాలా గౌరవింపబడుతుందంటూ..

ఈ భారత దేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవింపబడుతూ, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. సాధారణ యువతులు దేని పైన అయినా నిందలు వేస్తూ ఉపయోగంలేని వారిగా చూపిస్తూ, సంబంధం లేని వాటిని వారికి అంటగడుతున్నారని ఆరోపించారు.

  Poonam Kaur Issue : పూనం కౌర్‌ సంచలనం : మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై
   యువతుల ఆత్మ, మనస్సు, శరీరం చంపేందుకు

  యువతుల ఆత్మ, మనస్సు, శరీరం చంపేందుకు

  అంతా కలిసి అలాంటి యువతుల ఆత్మను, మనస్సును, శరీరాన్ని చంపేందుకు సిద్ధమవుతున్నారని పూనమ్ కౌర్ వాపోయారు. అమాయకులను ఇరికిస్తున్నారన్నారు. ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కాగా, జనసేన అధినత పవన్ కళ్యాణ్‌పై నిత్యం విమర్శలు చేస్తూ మహేష్ కత్తి మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే.

   మహేష్ కత్తి వర్సెస్ పూనమ్ కౌర్

  మహేష్ కత్తి వర్సెస్ పూనమ్ కౌర్

  ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ మధ్యలో ఎంటర్ అయి చిన్న ట్వీట్ చేశారు. దీంతో మహేష్ కత్తి ఆమె మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా ప్రశ్నలు సంధించారు. పూనమ్ కౌర్‌కు వ్యక్తిగత ప్రశ్నలు సంధించి ఆయన ఓ అమ్మాయిని తీవ్రంగా అవమానించారని సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె కూడా ఈ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులోకి తనను లాగవద్దన్నారు. ఆ తర్వాత మహేష్ కత్తి వాళ్ల అమ్మపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను ఆమె ఖండించారు. ఆ తర్వాత ఇప్పుడు ట్వీట్ చేశారు.

   రామ్ గోపాల్ వర్మ సినిమాపై ప్రశంస

  రామ్ గోపాల్ వర్మ సినిమాపై ప్రశంస

  వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ పేరుతో ఓ చిత్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో ఓ పోర్న్ స్టార్‌తో చేసిన చిత్రానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను, ఈ వీడియోలో ఉన్న పోర్న్ స్టార్‌ను అయిన మియా మల్కోవాని మహేష్ కత్తి పొగుడుతూ ట్వీట్ చేశారు.

   మియా ఒక దేహం కాదంటూ

  మియా ఒక దేహం కాదంటూ

  మియా ఒక దేహం కాదని, విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం అని, మియా ఒక స్త్రీ కాదని, స్త్రీ లైంగిక స్వేచ్ఛా స్వాతంత్రాలకు ప్రతిరూపమని, కొన్ని యుగాలుగా అణిచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో వర్మ, అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక.. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అని మహేష్ కత్తి ప్రశంసించారు.

   తత్వవేత్తల వేదాంతం

  తత్వవేత్తల వేదాంతం

  'షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది. ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది.' అని మహేష్ కత్తి పేర్కొన్నారు.

   మియా రూపం

  మియా రూపం

  'మియా రూపం. గొంతు. వర్మ షాక్ వాల్యుతోపాటు, ఎం.ఎం.కీరవాణి నేపధ్య సంగీతం ఒక ఎపిక్ విలువని జోడించింది. గుండె దిటవు చేసుకుని. మెదడు విప్పారజేసి చూడండి. నాకులాగా మీరూ ఎదురుచూస్తారు. మొత్తం ఫిల్మ్ ఎప్పుడు చూస్తామా అని.' అని మహేష్ కత్తి పోస్ట్ పెట్టారు.

   మహేష్ కత్తిని ఉద్దేశించి పెట్టకున్నా దిమ్మతిరిగే షాక్

  మహేష్ కత్తిని ఉద్దేశించి పెట్టకున్నా దిమ్మతిరిగే షాక్

  ఈ నేపథ్యంలో మహేష్ కత్తి పోస్టుకు ప్రతిగా పూనమ్ కౌర్ పెట్టి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆమె ఎందుకు పెట్టారనేది స్పష్టంగా తెలియదు. అయితే, పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ అక్షరాలా సత్యం అని మరికొందరు అంటున్నారు. ఆమె నిజంగా మహేష్ కత్తిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టకపోయినప్పటికీ ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్ వంటి అమ్మాయిపై అనుచితంగా ప్రశ్నలు సంధించి, అతను ఓ పోర్న్ స్టార్‌ను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'Porn Stars have better life and respect in India.. than normal indian girls.. innocents are framed... misused and abused and if they stand up for some thing.. all are prepared to kill her soul.. mind.. and body..' tweeted Poonam Kaur.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more