హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోసాని కృష్ణమురళితోపాటు ఫ్యామిలీకి కరోనా పాజిటివ్: ఆస్పత్రిలో చేరిక, బాధగా ఉందంటూ ఆవేదన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోసాని వెల్లడించారు. ప్రస్తుతం పోసాని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక, నిర్మాతలు, హీరోలను మన్నించాలని కోరారు.

Recommended Video

Array

తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు.

 Posani krishna murali admitted in hospital after coronavirus positive

ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో దేవుడి దయ వల్ల త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటానని పోసాసిన కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, పోసాని త్వరగా కోలుకోవాలని పలువురు సినీనటులు, దర్శకులు ఆకాంక్షించారు.

తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా..

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా కరోనావైరస్ కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,11,947 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా, నమోదైన 623 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,43,716కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3796కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1714 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,30,732కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.98 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది.

English summary
Posani krishna murali admitted in hospital after coronavirus positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X