వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్‌.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరెంట్ బిల్లుల్లో మోసం జరుగుతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ మేసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. ముప్పై రోజులకు కొట్టాల్సిన బిల్లు పది రోజుల వరకు ఆలస్యంగా కొట్టడంలో మోసం దాగి ఉందనేది దాని సారాంశం. ఆ రకంగా ప్రజలు మోసపోతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించేలా సర్క్యులేట్ అవుతోంది. అయితే అదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు అధికారులు. అందులో ఎలాంటి మోసం లేదని చెబుతున్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప అందులో వాస్తవం లేదంటున్నారు.

 కరెంట్ బిల్లుల్లో మోసమంటూ ప్రచారం..!

కరెంట్ బిల్లుల్లో మోసమంటూ ప్రచారం..!

విద్యుత్ బిల్లులు సాధారణంగా నెలకోసారి తీస్తుంటారు. మీటర్ రీడింగ్ నమోదు చేసి నెల రోజుల్లో ఎంత మేర యూనిట్లు కాలిస్తే అంత మేర బిల్లు రావడం పరిపాటి. అయితే ఇక్కడ స్లాబ్ రేట్ల పరంగా విద్యుత్ బిల్లులు జనరేట్ అవుతుంటాయి. వంద యూనిట్ల వరకు ఒక్క రేటు.. ఆ తర్వాత యూనిట్లు పెరిగిన కొద్దీ స్లాబ్ రేట్లు మారుతుంటాయి. ఆ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో కరెంట్ బిల్లింగ్‌లో మోసమంటూ ఓ మేసేజ్ బాగా సర్క్యులేట్ అవుతోంది.

విద్యుత్ శాఖ ఉద్యోగులు నెల రోజులకు కరెంట్ బిల్లులు కొట్టాల్సి ఉంటుంది. అయితే 30 రోజుల వ్యవధిలో బిల్లులు తీయకుండా 31 నుంచి 40 రోజుల వరకు బిల్లులు కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆ మేసేజ్ షేర్ అవుతోంది. ఉదహరణలతో సహా వివరించేసరికి అందరూ నిజమని నమ్ముతున్నారు.

తెలంగాణలో రజాకార్ల రాజ్యం.. 8వ నిజాం రాజు ఆయనేనట.. రాజా సింగ్ ఫైర్..! (వీడియో)

 30 రోజులకు బిల్లింగ్.. ఆలస్యం చేస్తూ బిల్లు ఎక్కువేస్తున్నారంటూ..!

30 రోజులకు బిల్లింగ్.. ఆలస్యం చేస్తూ బిల్లు ఎక్కువేస్తున్నారంటూ..!

100 యూనిట్ల కరెంట్ కాలిస్తే స్లాబ్ రేట్ ప్రకారం యూనిట్‌కు 3 రూపాయల 60 పైసలు చొప్పున మొత్తం బిల్లు 360 రూపాయలు అవుతుందని.. అదే రెండు రోజులు ఆలస్యంగా బిల్లు కొట్టడం మూలంగా జనాల జేబుకు చిల్లుపడుతుందని ఆ మేసేజ్‌లో పేర్కొన్నారు. సరిగ్గా ముప్పై రోజులకు బిల్లు తీస్తే 100 యూనిట్లు కాల్చినదానికి 360 రూపాయలు బిల్లు కడితే సరిపోతుందని.. అదే సమయంలో రెండు రోజులు ఆలస్యమైతే అది కాస్తా 106 యూనిట్లకు చేరి బిల్లు తడిసిమోపడవుతుందని రాశారు.

101 యూనిట్లు దాటినప్పుడు 6 రూపాయల 90 పైసల చొప్పున కట్టాల్సి ఉంటుందన్నది ఆ మేసేజ్ సారాంశం. ఆ లెక్కన 106 యూనిట్లకు 731 రూపాయల 40 పైసలు అవుతుంది. అంటే అదనంగా 371 రూపాయల 40 పైసలు (731.40 - 360.00 = 371.40) అదనంగా కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇలా ఏ ఒక్కరికో అన్యాయం జరగడం లేదని రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ బిల్లుల మోత మోగిస్తున్నారని ఆ మేసేజ్‌లో ఆరోపించారు.

అందులో నిజం లేదంటున్న అధికారులు

అందులో నిజం లేదంటున్న అధికారులు

కానీ అందులో వాస్తవం లేదంటూ అధికారులు మరో మేసేజ్ రిలీజం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లింగ్ అనేది ప్రత్యేక సాఫ్ట్‌వేర్ గొడుగు కింద పనిచేస్తుందని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఎవరో మేధావులు సోషల్ మీడియాలో చేస్తున్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కరెంట్ బిల్లుల విషయంలో తప్పులు జరగబోవని స్పష్టం చేస్తున్నారు. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ చాలా కాలం కిందటే సవరించామని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.

వినియోగదారుడు 1 బి (1) స్లాబ్ పరిధిలోకి వస్తే, మొదటి స్లాబ్ రేటు 0-100 యూనిట్లకు 3 రూపాయల 30 పైసలు చొప్పున ఉంటే 330 రూపాయల బిల్లు వస్తుంది. అదే బిల్లింగ్ 10 రోజులు ఆలస్యం జరిగినప్పటికీ వినియోగదారుడికి మాత్రం అన్యాయం జరగదని అంటున్నారు అధికారులు. ఒకవేళ 40 రోజుల్లో సదరు వినియోగదారుడు 133 యూనిట్లు కాలిస్తే.. బిల్లింగ్ తేదీని ప్రామాణికంగా తీసుకుని ఆటోమేటిక్‌గా ఆ 133 యూనిట్లు కూడా మొదటి స్లాబ్ పరిధిలోకి వస్తాయే తప్ప రెండో స్లాబ్ లోకి రావని వివరిస్తున్నారు.

వ్యభిచారం వయా వాట్సాప్.. హైదరాబాద్‌లో కాదు ఆ జిల్లాలో..!

 తప్పుడు ప్రచారం నమ్మొద్దని..!

తప్పుడు ప్రచారం నమ్మొద్దని..!

ఏదో జరిగిపోతోందని కొందరు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నారు. అలాంటి మేధావులు ఇలాంటి సందేశాలను పోస్ట్ చేసేటప్పుడు సంబంధిత అధికారుల దగ్గర బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను పరిశీలిస్తే బావుంటుందని సూచిస్తున్నారు. విద్యుత్ బిల్లులపై వచ్చే ఇలాంటి మేసేజ్‌లను నమ్మకుండా అధికారులతో మాట్లాడి ప్రజలు ధృవీకరించుకోవచ్చని సూచిస్తున్నారు. దయచేసి వినియోగదారులు ఇలాంటి చెడు ప్రచారాలను ఆదరించొద్దని.. ఫార్వార్డ్ చేసి ఇతరులను కన్ఫ్యూజ్ చేయొద్దని అభ్యర్థిస్తున్నారు.

English summary
The Billing software was modified long back and implemented as per the directions of honourable electricity regulatory commission to avoid unnecessary burden on electricity consumers in case of delay in billing. The electricity consumers are requested not to believe such false and fake news circulated in social media, says officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X