• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దరిద్రపు పాదం, ఐరన్ లెగ్, ఛీచీ నీతో పొత్తా, అంత సక్కనోడివని బెదిరిస్తున్నావా బిడ్డా: బాబుపై కేసీఆర్

|

వనపర్తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలోను తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మొన్న నిజామాబాద్, నిన్న నల్గొండలో చంద్రబాబును టార్గెట్ చేశారు. శుక్రవారం మళ్లీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

బాబూ! సిగ్గుందా, దెబ్బకు అమరావతిలో పడ్డావ్, మూడో కన్ను తెరిస్తే నీ పని అంతే: కేసీఆర్ హెచ్చరిక

చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలమూరు జిల్లాకు దిక్కుగా ఉంటానని చెప్పాడని, కానీ ఏం చేశాడని, మన గుండెలపై గుద్దాడని కేసీఆర్ అన్నారు. ఇక్కడ వేసిన శిలాపథకాలు తీస్తే ఓ సముద్రం అవుతుందని ఎద్దేవా చేశారు. అలాంటి దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్ పార్టీ నీచాతినీచంగా పొత్తు పెట్టుకొని, చంద్రబాబును తీసుకు వస్తోందన్నారు.

అమరావతికి గులాములం అవుదామా, చంద్రబాబును తెస్తున్నారు

అమరావతికి గులాములం అవుదామా, చంద్రబాబును తెస్తున్నారు

ఆంధ్రోళ్లకు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడదామా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమరావతికి గులాములం అవుదామా అన్నారు. తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలా, ఢిల్లీలో జరగాలా అని ప్రశ్నించారు. అధికారం మన చేతిలో ఉండాలన్నారు. ఢిల్లీ లేదా విజయవాడ చేతుల్లో గులాములం కావొద్దన్నారు. ఈ పట్టు వీడితో (ఉద్యమం పట్టు) గోచీ ఊడిపోతుందన్నారు. మీ బిడ్డగా చెబుతున్నానని, ఇన్నేళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గద్దలు తన్నుకుపోయేలా చూడవద్దన్నారు. చంద్రబాబును కాంగ్రెస్ నేతలు తెస్తున్నారన్నారు.

నువ్వు సక్కనోడివని బెదిరిస్తున్నారా, ఓటుకు నోటు దొంగవు కాదా

నువ్వు సక్కనోడివని బెదిరిస్తున్నారా, ఓటుకు నోటు దొంగవు కాదా

ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ ఒక్కటి అయ్యారని చంద్రబాబు అంటున్నారని, నాకు ఏమి అవసరం రా బయ్!.. అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తనను బెదిరిస్తున్నారని చెబుతున్నాడని, నువ్వు అంత చక్కటి మనిషివి అని బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటులో దొరికిన దొంగవు అన్నారు. ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా నీ వాయిస్ రికార్డ్ లేదా అన్నారు. డబ్బులు ఇస్తుంటే దొరికింది నీ వ్యక్తి కాదా అన్నారు.

ఎవరిని బెదిరిస్తున్నావ్ బిడ్డా, ఛీచీ నీతో పొత్తా

ఎవరిని బెదిరిస్తున్నావ్ బిడ్డా, ఛీచీ నీతో పొత్తా

ఎవరిని బెదిరిస్తున్నావు బిడ్డా అని కేసీఆర్... చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నేను సోపతి చేద్దామని అంటే కేసీఆర్ అంగీకరించలేదని, అందుకే మహాకూటమి వచ్చిందని చెబుతున్నారని, కానీ ఇన్నేళ్లు దోచుకున్నావని, అలాంటి నీతో పొత్తా.. చంద్రబాబు.. ఛీఛీ అన్నారు. బతికుండగా నీతో కలవనని చెప్పారు. కేసీఆర్ అంగీకరించకుంటేనే మహాకూటమి ఏర్పాటు చేశామని అన్నారని, మహా కూటమా.. గూటమా.. మేం జవాబు చెబుతామన్నారు.

చంద్రబాబూ.. తేల్చుకుందామా, నీది ఐరన్ లెగ్

చంద్రబాబూ.. తేల్చుకుందామా, నీది ఐరన్ లెగ్

మీ దమ్ము, మా దమ్ము తేల్చుకుందామా అని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు. నీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబుది దరిద్రమైన పాదమని, ఐరన్ లెగ్ అన్నారు. ఈ రోజు ప్రారంభమైన ప్రగతి రథం ఆగదని చెప్పారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీరు వచ్చి అద్భుత పాలమూరు, తెలంగాణ తెస్తామన్నారు. కాగా, అంతకుముందు సమయం అయిపోతున్న సమయంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెప్పుకుంటూ పోతే తెల్లారే దాకా నేన చెబుతానని, కానీ ఈ హెలికాప్టర్‌తో బాధ అని, మాట్లాడాలని ఉన్నా హెలికాప్టర్ బాధ ఉందని వ్యాఖ్యానించారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhara Rao has lashed out at his counterpart in Andhra Pradesh, N Chandrababu Naidu, calling him a thief and a traitor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X