శభాష్ సోనూసూద్: సెట్స్‌లో సన్మానించిన ప్రకాశ్ రాజ్..
కరోనా వైరస్ సమయంలో పని లేక కూలీలు ఇబ్బంది పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లేందుకు కూలీలు పడ్డా.. పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆ సమయంలో సోనూ సూద్ రియల్ హీరోగా మారిపోయాడు. దాదాపు 7 వేలకు పైగా మందికి సాయం చేశారు. అయితే సోనూ సూద్ చేసిన మంచి పనిని పలువురు కొనియాడుతున్నారు. యు ఆర్ గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. అయితే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. సోనూ సూద్‌ను సన్మానించారు.
అల్లుడు అదుర్స్ సెట్ సినిమా షూటింగ్ జరుగుతోంది. నటీ నటులు, టెక్నీషియన్స్ పాల్గొనగా.. ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. అటు వైపు చూస్తూ సోనూ సూద్ కనిపించారు. లాక్ డౌన్ సమయంలో చేసిన మంచి పని గుర్తొచ్చింది. షూటింగ్ వద్దకు చేరుకున్న సోనూసూద్‌కు ప్రకాశ్ రాజ్ శాలువా కప్పి.. పుష్పగుచ్చం అందజేశారు. జ్ఞాపిక కూడా బహుకరించారు. సోనూ సూద్ రాకతో సెట్స్ వద్ద సందడి నెలకొంది.

కష్ట సమయంలో సోనూ సూద్ ఆపన్నులకు అందజేసిన సాయాన్ని ప్రకాశ్ రాజ్ కొనియాడారు. సోనూసూద్‌ను మనస్ఫూర్తిగా ప్రకాశ్ రాజ్ అభినందించారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సోనూ సూద్ బస్సులు, రైళ్ల ద్వారా వలస కూలీలను స్వస్థలలాకు పంపించివేశారు. విదేశాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక విమానా ద్వారా స్వస్థలాలకు చేర్చారు. భారతీయు విద్యార్థులను కూడా స్వదేశానికి రప్పించారు. అడిగితే సాయం చేస్తూ అపర దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Actor @prakashraaj felicitated @SonuSood on sets of #AlluduAdhurs👏👏👏#PrakashRaj #SonuSood #AlluduAdhurs #Tollywood #Newsqube pic.twitter.com/6DlEEUXFyX
— NewsQube (@NewsQube) September 28, 2020