• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

MAA వివాదం:మేము విజన్‌తో వచ్చాం.. డివిజన్ కోసం కాదు: ప్రకాష్ రాజ్‌కు నరేష్ కౌంటర్..నాగబాబుపై అలా..!

|

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ "మా" ఎన్నికలు రక్తికడుతున్నాయి. శుక్రవారం రోజున ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి లోకల్ - నాన్‌లోకల్ అంశం గురించి స్పష్టం చేసిన నేపథ్యంలో శనివారం రోజున మా అధ్యక్షుడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు ఎవరైనా సరే పోటీ చేయొచ్చని చెప్పారు. ఇప్పటి వరకు తామెప్పుడు లోకల్-నాన్ లోకల్ ఇష్యూను తీసుకురాలేదని చెప్పారు. ప్రకాష్ రాజ్ మంచి నటుడు కావడమే కాదు తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చిన నరేష్... తాను ఎన్నికల గురించి మూడు నెలల క్రితమే తనతో చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని తాను చెప్పినట్లు నరేష్ వెల్లడించారు.

  MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight| Oneindia Telugu
   మేమే చేసిన పనులు ఇవే

  మేమే చేసిన పనులు ఇవే

  ఇక తమ హయాంలో ఏం చేశారో నరేష్ చెప్పుకొచ్చారు. పెన్షన్లను 800శాతం మేరా పెంచామని చెప్పారు. ఇక పలువురికి ఆర్థిక సహాయం చేశామని చెప్పారు. అంతేకాదు చాలామందికి ఇన్ష్యూరెన్స్‌లు కూడా చేయించామని వెల్లడించిన నరేష్... కరోనా కష్టకాలంలో చాలామంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారని చెప్పారు. దాదాపుగా రూ.30 లక్షలు విరాళాల రూపంలో వచ్చాయని చెప్పారు. ఇందులో రాజశేఖర్ దంపతులు రూ.10 లక్షలు ఇచ్చారని చెప్పారు. ఇక 728 మందికి జీవిత బీమా కల్పించామని చెప్పిన నరేష్.. రూ.వెయ్యిగా ఉన్న పెన్షన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తు చేశారు.

   నాగబాబు వ్యాఖ్యలు బాధకు గురిచేశాయి

  నాగబాబు వ్యాఖ్యలు బాధకు గురిచేశాయి

  శుక్రవారం రోజున నాగబాబు మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని నరేష్ అన్నారు. మా మసకబారిపోయిందని చెప్పడం బాధాకరమని అన్నారు. ఎన్నో మంచి పనులు చేశామని వాటిని చిరంజీవి సైతం అభినందించారని గుర్తు చేశారు నరేష్. ఇక కరోనా సమయంలో సీసీసీకి లక్ష రూపాయలు వచ్చాయని చెప్పారు. ఇక వృద్ధ కళాకారులకు అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేశామని అయితే కరోనా కారణంగా అవి ఫలించలేదని నరేష్ వెల్లడించారు. తనకు కథలు చెప్పే అలవాటు లేదని.. కేవలం తాను కాగితాలు చూపే మాట్లాడతానని నరేష్ చెప్పారు. కరోనా కష్ట సమయంలో సాయం కోసం 140 మంది దరఖాస్తు చేసుకున్నారని నరేష్ వివరించారు. తాము ఒక విజన్‌తో వచ్చామని అందరినీ కలుపుకుని పోవడమే తనకు తెలుసునని నరేష్ స్పష్టం చేశారు.

   విజన్‌తో వచ్చాం.. డివిజన్ కోసం కాదు

  విజన్‌తో వచ్చాం.. డివిజన్ కోసం కాదు

  ఇప్పటి వరకు పనిచేసిన మా అధ్యక్షులందరూ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు నరేష్. మా ఒక దిగ్గజ సంస్థ అని దీన్ని కూల్చడం ఎవరి తరం కాదని చెప్పారు. ఇక ఈ సారి మహిళకు ఛాన్స్ ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని నరేష్ చెప్పారు. ఇక్కడ ఎవరూ పదవుల కోసం పాకులాడటం లేదని.. విజన్‌తో వచ్చామని నరేష్ పునరుద్ఘాటించారు. ఈ సారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకే ప్రయత్నిస్తున్నామని తన ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారు నరేష్. ఇక కౌంటర్ ఎన్‌కౌంటర్‌తో మా లో విబేధాలు ఏ స్థాయికి చేరుతాయో కాలమే సమాధానం చెప్పాలి.

  English summary
  They never brought the local and non local issue when it came to MAA elections said the current president Naresh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X