వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణయ్ అంతిమయాత్ర, అమృతను ఊరడించిన అజయ్: హత్యపై కేటీఆర్ స్పందన

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: ప్రణయ్ అంతిమయాత్ర ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతిమయాత్రలో ప్రణయ్ భార్య అమృత, సోదరుడు అజయ్, అతని తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రణయ్ బాడీపై పడి అందరూ ఏడుస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు. అంతిమయాత్ర సందర్భంగా ట్రాక్టర్ పైన భర్త మృతదేహం వద్ద అమృత రోధించింది.

అంతకుముందు, అజయ్ (ప్రణయ్ తమ్ముడు) ఇంటికి రాగానే అమృత వర్షిణి పడిపడి ఏడ్చింది. అతను ఆమెను ఊరుకుంచే ప్రయత్నాలు చేశాడు. అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు బోరున విలపించాడు. అజయ్ ఇంటికి రావడంతో అతడిని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి రోదనలు విన్న స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అమృత తండ్రి మారుతీరావు ఇంటి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రణయ్‌ తండ్రి బాలాస్వామి మిర్యాలగూడ ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పని చేస్తుండగా, అమృత తండ్రి మారుతిరావు స్థానిక రియల్టర్‌, బిల్డర్‌..

నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను...నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను...

Pranay final rites in Miryalaguda

ప్రణయ్ హత్యను ఖండించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీ రామారావు ప్రణయ్ హత్యను ఖండించారు. అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టమిర్యాలగూడలో ప్రణయ్‌ అనే యువకుడిని దారుణంగా చంపిన ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. ఇప్పటికీ కులం ఇంతటి దారుణాలకు ఒడిగట్టేలా చేయడం చూసి చాలా కోపం వస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వారికి కచ్చితంగా శిక్షపడి న్యాయం గెలుస్తుంది. ప్రణయ్‌ భార్య అమృతకు, అతని తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన'ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్ కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

English summary
Pranay final rites in Miryalaguda. Pranay wife Amrutha, Brother Ajay, parents and villagers participated in last rites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X