హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టుకు ప్రత్యూష: సీఎం ఇంటికి తీస్కెళ్లండి, కెసిఆర్‌కు జడ్జి కితాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష హైదరాబాదులోని గ్లోబల్‌ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రత్యూషను హైకోర్టులో పోలీసులు బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో హాజరు పరిచనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యూష మీడియాతో మాట్లాడారు.

తనను చిత్రహింసలు పెట్టిన నాన్న, సవతి తల్లిని కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తిని కోరుతానని ఆమె చెప్పారు. తండ్రి రమేష్, తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

Prathyusha discharged from Global hospital

తాను బిఎస్సీ నర్సింగ్ చదివి పేదలకు సేవ చేస్తానని ప్రత్యూష చెప్పారు. బంధువుల వద్ద ఉండేందుకు ఆమె నిరాకరించారు. ప్రత్యూషను తాను తన ఇంటికి తీసుకుని వెళ్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే.

ప్రత్యూష చదువు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రత్యూషకు పూర్తి సహకారం అందించాలని, భద్రత కల్పించాలని ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు కూడా.

English summary
Prathyusha discharged from Global hospital in Hyderabad will be produced before High Court justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X