• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేను మేజర్ని, అతడ్నే పెళ్లి చేసుకుంటా: కోర్టుకు ప్రత్యూష, ఎవరీ మద్దిలేటి రెడ్డి?

|

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దత్తపుత్రిక ప్రత్యూష వ్యవహారం మరో మలుపు తిరిగింది. తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన ప్రత్యూష తదనంతర పరిణామాల్లో కేసీఆర్ కు దత్తపుత్రికగా మారిన సంగతి తెలిసిందే.

కన్న తండ్రి పెట్టిన చిత్రహింసల కారణంగా తీవ్ర గాయాలపాలైన ప్రత్యూషను ఆస్పత్రిలో చేర్పించిన సీఎం కేసీఆర్.. మెరుగైన వైద్యం చేయించారు. ఆ తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి చేరింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన సందర్భంగా కేసీఆర్... ఆ బాలికను ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టించారు. ఆమె సంరక్షణ బాధ్యతలు తనవేనని ప్రకటించారు.

ప్రత్యూష ప్రేమ కథ ఇలా మొదలైంది!: పెళ్లిపై కెసిఆర్‌దే తుది నిర్ణయంప్రత్యూష ప్రేమ కథ ఇలా మొదలైంది!: పెళ్లిపై కెసిఆర్‌దే తుది నిర్ణయం

ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడు వెంకట మద్దిలేటిరెడ్డితో ప్రేమలో పడిన ప్రత్యూష అతడినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టింది.

Prathyusha

మేజర్‌ని అతడ్నే పెళ్లి చేసుకుంటా: కోర్టుకు ప్రత్యూష

ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వొకేషనల్ పరీక్ష కూడా పాసైంది. బీఎస్సీ నర్సింగ్ చేయటమే తన లక్ష్యంగా చెప్పిన ఆమె.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటిరెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించింది.

ఈ విషయాన్ని మహిళా సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా తెలిపింది. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలుమార్లు కౌన్సెలింగ్ చేసే యత్నం చేస్తున్నా.. ప్రస్తుతం తాను ఇరవై ఏళ్ల మేజర్‌నని, తన ఇష్టప్రకారం చేయాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది.

ఎవరీ వెంకట మద్దిలేటిరెడ్డి?

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీకి చెందిన మద్దిలేటిరెడ్డి(27) బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా‌పని చేస్తున్నాడు. గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న తన మిత్రుడి పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించేందుకు వెళ్లి.. ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు.

ఇలా వరుసగా రెండ్రోజులు వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లాడు. ప్రభుత్వ సంరక్షణలో చేరిన తర్వాత మద్దిలేటికి ప్రత్యూష ఫోన్ చేయటం, అతను కూడా ఆమెకు ఫోన్లు చేయటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ, పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది.

హాస్టల్‌లో ఉండలేను, పెళ్లి చేసుకుంటా: ప్రత్యూష

తాను హాస్టల్‌లో ఉండలేనని, మద్దిలేటిరెడ్డిని పెళ్లి చేసుకున్నాకే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని ప్రత్యూష చెబుతోంది. హాస్టల్‌లో అన్నంలో సోడా వేస్తున్నారని, ఉడకని బియ్యంతో కూడిన అన్నం తినలేక పోతున్నానని తెలిపింది. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతోంది.

ప్రత్యూషను పెళ్లి చేసుకుంటా: వెంకట మద్దిలేటి రెడ్డి

ప్రత్యూషను ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి రెడ్డి చెబుతున్నాడు. ఈ విషయాన్ని తమ ఇంట్లో కూడా చెప్పి తన తల్లిని ఒప్పించినట్లు తెలిపాడు. తాను పేదవాడినైనా, మాట తప్పేవాడిని కాదని చెబుతున్నాడు.

ప్రత్యూషే తొలుత తనకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చిందని తెలిపాడు. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానని మద్దిలేటిరెడ్డి స్పష్టం చేస్తున్నాడు.

కాగా, ప్రత్యూషను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత.. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించలేదని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావు తెలిపారు. ఈ విషయంలో ఆమెకు మానసిక వైద్యులతో శిక్షణ ఇప్పించాలని అచ్యుతరావు తెలిపారు.

English summary
It said that Prathyusha wanted to marriage her lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X