కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వివాహిత, కవలలు అని తెలిసి ఆనందం.. అంతలోనే విషాదం...

|
Google Oneindia TeluguNews

వారికి పెళ్లై 13 ఏళ్లవుతోంది. కానీ పిల్లలు కలగలేదు. అందుకోసం వారు వెళ్లని ఆస్పత్రి లేదు. చివరికి ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లడంతో.. వారి కల నేరవేరింది. ఎట్టకేలకు వివాహిత గర్భం దాల్చింది. ఆమె 8 నెలల గర్భవతి.. కవలలు జన్మించబోతున్నారని తెలిసి.. వారి సంతోషానికి అవధి లేకుండా పోయింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కవలలు పిల్లలు సహా గర్భిణీ చనిపోయి.. భర్తకు దు:ఖాన్ని మిగిల్చింది.

లాక్‌డౌన్: రోడ్డు మధ్యలో భారీ గుంత, డోలీలో గర్భిణీ నరకయాతన(వీడియో)లాక్‌డౌన్: రోడ్డు మధ్యలో భారీ గుంత, డోలీలో గర్భిణీ నరకయాతన(వీడియో)

సుదీర్ఘ నిరీక్షణ..

సుదీర్ఘ నిరీక్షణ..

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన జూపాక కనకయ్యకు.. సైదాపూర్ మండలం ఎలబోతారానికి చెందిన స్వరూపతో 13 ఏళ్ల కింద వివాహం జరిగింది. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లల కోసం ఎవరు చెబితే..ఆ ఆస్పత్రికి వెళ్లారు. చివరికీ వరంగల్‌లో గల ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లారు. అలా 8 నెలల కిందట వివాహిత గర్భం దాల్చింది. కవలలు జన్మిస్తున్నారని తెలియజేయడంతో వారు తెగ సంబరపడిపోయారు. మరికొద్దిరోజుల్లో డెలివరీ అనేలోగానే విషాదం జరిగిపోయింది.

పుట్టింటికీ వెళ్లి

పుట్టింటికీ వెళ్లి

స్వరూప ఇటీవలే పుట్టింటికీ వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఛాతిలో నొప్పి ఉందని భర్తకు తెలిపింది. వెంటనే వారు హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీపీ ఎక్కువవడంతో ఐసీయూకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే అంతలోనే ఆమె నిండుచూలాలు చనిపోయింది. భార్య పోయినందున.. కనీసం పిల్లలను బతికించాలని కనకయ్య వైద్యులను కోరారు. అందుకు పై అధికారుల అనుమతి కోసం సూపరింటెండెంట్ ప్రయత్నించారు. ఆపరేషన్ చేయగా.. అప్పటికే కవలలు కూడా చనిపోయారు. భార్య, మరోవైపు పసికందుల మృతితో కనకయ్య గుండెలివిసేలా రోదించారు.

Recommended Video

Bandi Sanjay Demands Inquiry On Singareni Coal Mine Incident
అంతలోనే ఇలా..

అంతలోనే ఇలా..

మరో నెలరోజుల్లో కవలలు జన్మిస్తారని.. కనకయ్య దంపతులు ఆశగా ఎదురుచూశాడు. కానీ ఇంతలోనే అతని భార్య, కవలలు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కనకయ్య, కుటుంబసభ్యుల రోదనలతో ఆస్పత్రి మిన్నంటింది. ఓకేసారి ముగ్గురు చనిపోవడంతో ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. కనకయ్య స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
pregnant woman swaroopa and twins dead in huzurabad hospital. 13 years after woman pregnant through ivf but she is dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X