వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 కి.మీ నడిచిన నిండుచులాలు, రోడ్డుపైనే ప్రసవం, పండంటి బిడ్డ జననం..

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల చేతిలో పనిలేదు. వలసకూలీల వెతల గురించి వింటేనే కలచివేస్తోంది. పనిలేకపోవడంతో నిండుచూలాలు భర్త, బంధువులతో కలిసి తన గమ్యస్థానం వైపు అడుగులేస్తోంది. అయితే నొప్పి రావడంతో రోడ్డుపక్కన డెలివరీ చేశారు. భర్త, బంధువులు కలిసి.. ప్రసవం చేసిన హృదయ విదారకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచాక ప్రసవం కాగా.. వారి పెద్ద కుమారుడు మూడేళ్ల వయస్సున్న బుడతడు కూడా కూడా నడిచాడు అని అంశం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌కి చెందన జంట ఉపాధి నిమిత్తం సంగారెడ్డిలో ఉంటోంది. అయితే చేతిలో పనిలేకపోవడంతో ఛత్తీస్ గఢ్ వెళ్లాలనుకొంది. సంగారెడ్డి నుంచి రాజ్ నాందగావ్ కాలినడకన బయల్దేరారు. అయితే 70 కిలోమీటర్లు ప్రయాణించాక.. నార్సింగ్ మండలం జాప్తి శివనూర్ గ్రామం వద్ద మంగళవారం ఉదయం నొప్పులు వచ్చాయి. వెంటనే భర్త, బంధువులు కలిసి రోడ్డు పక్కన ఆపి డెలివరీ చేశారు. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించారు.

Pregnant woman forced to travel to Chhattisgarh on foot.. delivers baby on road

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రామాయంపేట ఏరియా ఆస్పత్రికి ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిండుచూలాలు రోడ్డు మీద డెలివరీ కావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వారిద్దరూ క్షేమంగా ఉండటం మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశం.

English summary
pregnant migrant worker was forced to deliver her baby on the road as she walked home from Telangana to Chhattisgarh due to the national Covid-19 lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X