వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్‌ఎస్‌లోకి అజారుద్దీన్: కేటీఆర్‌తో భేటీ తర్వాత..

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం ఈ రోజు మరింత బలపడింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజారుద్దీన్ భేటీ అయ్యారు. ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరటం ఖాయమనే ప్రచారం నడుమ ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు ముందే జరిగిన ఒప్పందం మేరకు ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని చెబుతున్నారు. ఆయన హెచ్ సీ ఏ అధ్యక్షుడిగా గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ సహకరించిందనే ప్రచారం సాగుతోంది. అయితే దీని పైన అజారుద్దీన్‌ స్పష్టత ఇవ్వటం లేదు. ఇదే సమయంలో ఆయన కేటీఆర్ తో కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము అన్ని పార్టీల నేతలను కలిసి క్రికెట్ కు సహకారం కోరుతామని చెబుతున్నారు. అయితే, ఇప్పటికే అజారుద్దీన్ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవటం ఖాయమని తెలుస్తోంది.

కొనసాగుతున్న పాక్ కుట్రలు: ఎల్ఓసీ వద్ద చొరబాట్లకు సహకారం: పసిగట్టిన నిఘా వర్గాలు..!కొనసాగుతున్న పాక్ కుట్రలు: ఎల్ఓసీ వద్ద చొరబాట్లకు సహకారం: పసిగట్టిన నిఘా వర్గాలు..!


కేటీఆర్ తో అజారుద్దీన్ భేటీ...
టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ తో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో గెలిచిన అజారుద్దీన్ ఇప్పుడు కేటీఆర్ ను కలవటం రాజకీయంగా చర్చకు కారణమైంది. కొద్ది రోజులుగా అజారుద్దీన్ టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారనే ప్రచారం జరిగుతోంది. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో తమ పార్టీ నుండి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన మాజీ ఎంీ వివేక్ ను ఓడించేందుకు అజారుద్దీన్ కు మద్దతు ఇచ్చేలా టీఆర్‌ఎస్‌ తో ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు.

president of HCA and congress leader Azharuddin met TRS working president KTR

ఫలితంగా ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరే విధంగా అంగీకరించారని సమాచారం. ఇక, అజారుద్దీన్ కోరుకున్న విధంగా హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఇక, ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచిన అజారుద్దీన్‌ ప్యానల్‌ మొత్తం కేటీఆర్ తో సమావేశం అయింది. ఈ సమావేశంలో తాము క్రికెట్ కోసం తీసుకొనే చర్యలు మద్దతు కోరామని అజారుద్దీన్ చెబుతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ అజార్ సమావేశం కానున్నారు.

ఎన్నికల ముందూ కేటీఆర్ తో భేటీ..
హెచ్‌సీఏ ఎన్నికల ముందు అజార్‌.. మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అప్పటికే హెచ్‌సీఏపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ వివేక్‌.. టీఆర్‌ఎ్‌సను వీడి బీజేపీలో చేరడంతో తన ప్యానల్‌కు మద్దతివ్వాల్సిందిగా కేటీఆర్‌ను అజార్‌ కోరారు. లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో వివేక్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైనా.. ఆయన మద్దతిచ్చిన ప్యానల్‌ను ఓడించడం ద్వారా ఆయనను దెబ్బతీయాలలని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది.

ఈ నేపథ్యంలోనే అజార్‌ విజ్ఞప్తికి కేటీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారని, ఈ సందర్భంగానే ఆయనను పార్టీలో చేర్చుకోవడంపైనా చర్చించారని ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పుడు హమీ ఇచ్చిన విధంగా అజారుద్దీన్ ను గెలిపించటంతో ఇప్పుడు అజారుద్దీన్ సైతం ఇక గులాబీ కండువా కప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ..అజారుద్దీన్ మధ్య నగరానికి చెందిన ఒక పార్టీ అధినేత మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది. ఆయన సూచన మేరకే టీఆర్‌ఎస్‌ లో చేరాలని అజారుద్దీన్ నిర్ణయించినట్లు సమాచారం.

English summary
Newly elected president of HCA and congress leader Azaharudding met TRS wroking presidet KTR. Azaharuddin may join in TRS shortly. In HCA elections he got help form TRS to defeat Vivek panel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X