హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్: కౌంటర్‌ను ధ్వంసం చేసి లడ్డూలు లూటీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయం ప్రాశస్త్యం, స్వామి వారి ప్రసాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయ సందర్శనకు వచ్చిన ప్రణబ్, అక్కడి నుంచి వెళ్లేదాకా ఆలయ అభివృద్ధి, స్వామి వారి ప్రసాదాలపై ఆసక్తి కనబరిచారు.

యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేకించి కట్టె పొంగలిపై ప్రణబ్ ఎక్కువ మక్కువ చూపారని తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ రాకను పురుస్కరించుకుని ఆలయ అధికారులు ఎనిమిది రకాల ప్రసాదాలను తయారు చేశారు. కట్టె పొంగలి లాంటి ప్రసాదాన్ని తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన, కట్టె పొంగలిని ఏఏ పదార్ధాలతో ఈ పొంగలిని తయారు చేస్తారంటూ అడిగి మరీ తెలుసుకున్నారంట.

సుమారు 5 నిమిషాల పాటు ఆయన కట్టె పొంగలి గురించి ఆలయ అధికారులతో మాట్లాడారని సమాచారం. రాష్ట్రపతి పర్యనటలో భద్రత విధులు నిర్వహించిన పోలీసులే ఆయన వెళ్లగానే ప్రసాదం కోసం పోలీసులు ఎగబడ్డారు. కౌంటర్ అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా 8 ట్రేల (ఒక్కో ట్రేలో 24 లడ్డులు) అభిషేక లడ్డూలను లూటీ చేశారు.

వివరాల్లోకి వెళితే, ఆదివారం మద్యాహ్నాం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొండ పైనుంచి తిరిగి వెళ్లిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో అభిషేక లడ్డూలు విక్రయించే ప్రసాద కౌంటర్ వద్దకు ఒక్కసారిగా వచ్చారు. ఒక్కటి రూ. 60 చొప్పున విక్రయించే లడ్డూల కోసం ఎగబడ్డారు. అయితే అందులో కొందరే టికెట్ తీసుకున్నారు.

మరికొంతమంది టికెట్ లేకుండా లడ్డూల కోసం సిబ్బందిని బెదిరించారు. టికెట్లు లేకుండా ప్రసాదం ఇవ్వడం కుదరదన్న ఆలయ సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నల్లగొండ జిల్లాలోని యాదాద్రి(యాదగిరి గుట్ట) పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీ లక్షీనరసింహస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

ఉదయం 11.30 గం.కు రాష్టప్రతి యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ మరో హెలికాప్టర్‌లో వచ్చారు.

 కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


అంతకుముందుగానే హెలికాప్టర్‌లో గుట్టకు వచ్చిన సీఎం కేసీఆర్ రాష్టప్రతి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఆయనతో పాటు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


సీఎం కేసీఆర్ రాష్టప్రతి ప్రణబ్‌కు పాదాభివందనం చేశారు. అనంతరం రాష్టప్రతి, సిఎం కెసిఆర్‌లు ఒక వాహనంలో, గవర్నర్ మరో వాహనంలో రోడ్డు మార్గం గుండా కొండపైకి చేరుకుని శ్రీ లక్షీనరసింహస్వామి దర్శనం చేసుకున్నారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


ఆలయం వద్ద ప్రధానార్చకులు లక్షీనరసింహాచార్యుల నేతృత్వంలో అర్చకులు, వేద పండితులు, దేవస్థానం ఇవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రత్యేకాధికారి కిషన్‌రావులు రాష్టప్రతికి గవర్నర్, సీఎంలు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

 కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


గర్భగుడిలో పంచనారసింహులను దర్శించుకున్న రాష్టప్రతి ప్రణబ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. క్షేత్ర పాలకుడికి, ఆండాళ్ అమ్మవారికి పూజలు నిర్వహించారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


స్వామి వారి దర్శనానంతరం రాష్టప్రతికి అర్చక బృందం మహాదాశీర్వచనం పలికారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి రాష్టప్రతికి లడ్డూప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

సిఎం కెసిఆర్ లక్ష్మీనరసింహుల ప్రతిమ జ్ఞాపికను బహుకరించారు. అలాగే, నూతనంగా నిర్మించనున్న యాదాద్రి దివ్యక్షేత్రం నమూనా చిత్రపటాన్ని రాష్టప్రతికి బహూకరించారు.

 కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్


ఈ సందర్భంగా యాదాద్రి దివ్యక్షేత్రం నూతన నిర్మాణ మాస్టర్ ప్లాన్‌ను సిఎం కెసిఆర్, ఆర్కిటెక్ట్ అనందసాయిలు రాష్టప్రతికి వివరించారు.

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్

అనంతరం ఆండాల్ గెస్ట్‌హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న పిదప రాష్టప్రతి అక్కడి నుండి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్టప్రతికి, గవర్నర్‌లకు సిఎం కెసిఆర్ వీడ్కోలు పలికారు.

English summary
President Pranab Mukherjee, who is on his southern sojourn till July 8, offered prayers at Sri Lakshminarasimha Swamy temple here on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X