వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24,25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇచ్చే విందుకు ఆయన హాజరుకానున్నారు. ఈ విందు కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి ఆహ్వానం పంపించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మహారాష్ట్ర,హర్యానా,ఒడిశా,బీహార్,కర్ణాటక ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం.

కాగా,ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోదీ, ట్రంప్.. రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియం చేరుకుంటారు. ఆ సమయంలో దాదాపు లక్ష మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ట్రంప్‌కు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యలో సబర్మతి ఆశ్రమం వద్ద ఆగనున్న ట్రంప్.. అక్కడ 15 నిమిషాలు గడుపుతారు. అక్కడి నుంచి మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసే 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకుంటారు. కార్యక్రమంలో ట్రంప్,మోదీ ఇద్దరూ ప్రసంగిస్తారు. లక్షా పది వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన మొతేరా స్టేడియం ఆరోజు కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో మూడు గంటల పాటు సాగే ట్రంప్ పర్యటన కోసం గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ.100కోట్లు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

 president ram nath invites cm kcr to dinner with donald trump

Recommended Video

#IranvsUSA : There Is No Way To Solving America And Iran Problem || Oneindia Telugu

24వ తేదీ మధ్యాహ్నం 3.30గంటలకు ట్రంప్, మెలానియా ఆగ్రా బయలుదేరుతారు. ఆ రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్లో బస చేస్తారు. మరుసటి రోజు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. తదనంతరం రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లి గాంధీకి నివాళులు అర్పిస్తారు. అనంతరం 11.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రంప్,మోదీ మధ్య అత్యున్నత స్థాయి సమావేశ: జరుగుతుంది. పలు కీలక ఒప్పందాలపై భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం యూఎస్ ఎంబసీ ఈసీఓ రౌండ్ టేబుల్‌లో పాల్గొంటారు. అనంతరం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసే అవకాశం ఉంది. అదే రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందులో కూడా పాల్గొంటారు. అనంతరం రాత్రి 10గంటలకు ట్రంప్, మెలానియా ప్రత్యేక విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు.

English summary
US President Donald Trump is scheduled to visit India on January 24 and 25. He will be attending a dinner hosted by President Ramnath Kovind as part of his second day tour. The President has also invited the chief ministers of several states for the banquet. As part of this, Telangana Chief Minister KCR has already been invited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X