వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమా: ఆ 38 మంది ఎమ్మెల్యేలు కెసిఆర్‌కు షాకిస్తారా?

రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు విపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు విపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఈ ప్రకటన అధికారపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.అయితే ఈ ప్రకటనలను టిఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. మీరాకుమార్‌ను బలిపశువును చేస్తున్నారని టిఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది.

రాష్ట్రపతి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్ గా ఉన్న కాలంలోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌ను కోరింది.

అయితే అప్పటికే టిఆర్ఎస్‌ ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాద్ కోవింద్‌కు మద్దతును ప్రకటించారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హజరయ్యారు. మూడురోజుల క్రితం రామ్‌నాధ్ కోవింద్ జలవిహర్‌లో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

రామ్‌నాద్ కోవింద్ భారీ మెజారిటీతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని కెసిఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణ అంశాన్ని తీసుకొని ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

38 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరాకుమార్‌కు మద్దతు

38 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరాకుమార్‌కు మద్దతు

తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరాకుమార్‌కు ఓట్లు పడేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అయితే ఈ విషయమై అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.అయితే అన్ని పార్టీలనుండి సుమారు 38 మంది ఎమ్మెల్యేలు మీరాకుమార్‌కు ఓటుచేసేందుకు ముందుకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇందులో మెజారిటీ అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.

మీరాకుమార్ వైపు మొగ్గు చూపడానికి కారణమిదేనా?

మీరాకుమార్ వైపు మొగ్గు చూపడానికి కారణమిదేనా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును పాస్ కావడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీరాకుమార్ బిల్లును పాస్ చేయడంలో కీలకంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. మీరాకుమార్ కృషి లేకపోతే తెలంగాణ బిల్లు పాసయ్యేది కాకపోయేదని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అయితే రామ్‌నాద్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏం పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అయితే తనకు మద్దతివ్వాలని మీరాకుమార్ టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్‌కు లేఖ రాశారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు సిబిఐ కేసులకు భయపడే ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మీరాకుమార్‌ను బలిపశువు చేస్తున్నారు

మీరాకుమార్‌ను బలిపశువు చేస్తున్నారు

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరాకుమార్‌ను బలిపశువు చేస్తున్నారని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ ఆరోపించారు. విపక్షాల అభ్యర్థిగా మీరాకుమార్‌ను ముందే ఎందుకు ప్రకటించలేదని టిఆర్ఎస్ ప్రశ్నించింది. రామ్‌నాద్ కోవింద్‌ను ఎంపికచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరాకుమార్ పేరును ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. సిఎం కెసిఆర్ సూచించినట్టుగానే దళిత అభ్యర్థిని ఎంపిక చేశారని ఆయన గుర్తుచేశారు.

అలాంటిదేమీ లేదు

అలాంటిదేమీ లేదు

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడ మీరాకుమార్‌కు ఓటు చేయరని టిఆర్ఎస్ ప్రకటించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి మోడీ మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌నుకోరారు. అందుకే తాము మద్దతిచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రశ్నేలేదన్నారు. సిబిఐ కేసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే ఉన్నాయన్నారు.

English summary
The Congress Legislature Party (CLP) has claimed that 38 MLAs currently in the Telangana Rashtra Samithi (TRS) would vote on their conscience in the July 17 Presidential elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X