వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో ప్రాధమిక విద్య .. 4వేల స్కూళ్ళు మూసివేత , మూసివేత దిశగా మరో 2 వేల స్కూళ్ళు ?

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో ప్రాధమిక విద్య ప్రమాదంలో పడింది. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సర్కారు బడులలో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం అధిక సంఖ్యలో పెరిగితే తెలంగాణా స్కూల్స్ మాత్రం ప్రమాదం అంచున ఉన్నాయి. విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదివేందుకు మొగ్గు చూపకపోవటంతో వేల సంఖ్యలో స్కూళ్ళు మూత పడుతున్నాయి.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ సర్కార్ .. వేల సంఖ్యలో స్కూళ్ళ మూసివేత

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ సర్కార్ .. వేల సంఖ్యలో స్కూళ్ళ మూసివేత

కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు మొత్తం 4,000 పాఠశాలలను మూసివేసినట్లు తెలుస్తోంది.టిఆర్ఎస్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు మూసి వేతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలల మూసివేత పట్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదేళ్ళ కాలంలో 4,000 పాఠశాలలను మూసివేసిందని, మరో 2 వేల నుండి 3,000 పాఠశాలలు ఇప్పుడు తెలంగాణలో మూసివేత అంచున ఉన్నాయని వ్యాఖ్యానించారు. 'కెసిఆర్ - సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయటమే కాదు విద్యార్థులకు విద్యను అందించే పాఠశాలలను కూడా మూసివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రస్తుత పరిస్థితిని గురించి తన పోస్ట్ లో తెలంగాణలో ప్రభుత్వం విద్యను సైతం సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల తరహాలో ద్వంసం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

ఈ విద్యా సంవత్సరం గణనీయంగా తగ్గిన విద్యార్థులు సంఖ్య.. మరోరెండు వేల స్కూళ్ళు మూసివేత యోచన

ఈ విద్యా సంవత్సరం గణనీయంగా తగ్గిన విద్యార్థులు సంఖ్య.. మరోరెండు వేల స్కూళ్ళు మూసివేత యోచన

తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుత విద్యా సంవత్సరంలో తక్కువ శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చదవటానికి ఆసక్తి చూపించని కారణంగా , విద్యార్థులు సంఖ్యా క్రమంగా తగ్గుతుంది. బడిబాట వంటి కార్యక్రమాలు సైతం ఫలితం ఇవ్వని పరిస్థితి. దీంతో తెలంగాణలోని 2,000 నుండి 3,000 వరకు ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే ప్రమాదం కనిపిస్తుంది . తక్కువ నమోదు ఉన్న పాఠశాలల నుండి విద్యార్థులను సమీపంలోని ఇతర పాఠశాలలకు బదిలీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక సూచనలను ఇచ్చింది . పాఠశాలలను మూసివేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ , ఖండించినప్పటికీ, విద్యార్థులను బదిలీ చేసే కసరత్తు మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది.

ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే అందరికీ విద్య అందని ద్రాక్షే అంటున్న విద్యారంగ నిపుణులు

ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే అందరికీ విద్య అందని ద్రాక్షే అంటున్న విద్యారంగ నిపుణులు

ఇక విద్యా రంగ నిపుణులు సైతం తెలంగాణలో విద్యా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యా పెరిగేలా చేసి అందరికీ విద్య అందించాల్సిన ప్రభుత్వం పాఠశాలల మూసివేత నిర్ణయం తీసుకోవటం వల్ల వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు ప్రాథమిక విద్యను కోల్పోయే ప్రమాదం వుంటుంది. అందరికీ విద్య అందరిదీ బాధ్యత అనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ముందుగా చొరవ తీసుకుని విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రభుత్వ పాఠశాలలలో ప్రమాణాలు పెంచాలి . కానీ ఇలా మూసివేస్తే అందరికీ విద్య అందని ద్రాక్షే అవుతుంది.

English summary
Congress alleged K Chandrasekhar Rao-led TRS Government has shut down around 4,000 State Run Schools in its first term from 2014 to 2019. The National Party expressed concern over more number of schools facing closure in the 2nd term of TRS Rule.Congress Leader Randeep Singh Surjewala took to his social media handle to comment that TRS Government had shutdown 4,000 Schools in the previous term and another 2,000 to 3,000 Schools are now on the verge of closure in Telangana. He dared to say, 'Dismantling is the word for KCR - From Secretariat Buildings to Public Education!'.Mr.Surjrewala described the current situation as self-annointed King KCR's latest body blow to Telangana's Public Education.As per media reports, Anywhere between 2,000 to 3,000 Government Schools in Telangana are facing the threat of closure in the current academic year due to low enrolment rate. State Government has passed oral instructions to transfer students from schools with low enrolments to other institutions nearby. Although Government Sources deny closure of schools, The exercise of transferring students has begun already.Experts say, Closure of Govt Schools based on low enrolment isn't appreciable. It's like depriving of basic education to children of backward regions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X