వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''ఎన్‌టిఆర్ కళ్ళల్లో నీళ్ళు చూశా, మోడీతో సంబంధాలు, బిజెపితో పొత్తు అలా చెడింది''

2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి కెసిఆర్ ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగానే పోటీ చేయాల్సి వచ్చిందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి కెసిఆర్ ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగానే పోటీ చేయాల్సి వచ్చిందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి ప్రకటించారు. బిజెపితో పొత్తు విషయమై తనతోపాటు హరీష్‌రావు, ఈటల రాజేందర్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఎన్‌టిఆర్ కారణమన్నారు.

ఈ ఎన్నికల సమయంలో కెసిఆర్ బిజెపితో పొత్తు విషయంలో సానకూలంగా స్పందిస్తే ఆ పార్టీతో పొత్తు ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోడీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు.

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు టిక్కెట్టు దక్కకపోవడానికి తాను కారణమనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.తాను వద్దంటే మంత్రి ఇవ్వకుండా ఆపరు, ఇవ్వాలంటే ఇవ్వరన్నారు. కెసిఆర్ నిర్ణయమే ఇందులో ఫైనల్ అని ఆయన చెప్పారు.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండీ రాధాకృష్ణ ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. పలు అంశాలపై జితేందర్‌రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.

బిజెపితో పొత్తును కెసిఆర్ వద్దన్నారు.

బిజెపితో పొత్తును కెసిఆర్ వద్దన్నారు.

2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని భావించాం. ఈ పొత్తు వల్ల తమకు ప్రయోజనం కలుగుతోందని తనతోపటు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ కూడ భావించినట్టు ఆయన చెప్పారు. అయితే కెసిఆర్ మాత్రం బిజెపితో పొత్తును వ్యతిరేకించినట్టు చెప్పారు. స్వతంత్రంగానే పోటీచేయాలని భావించాడని ఆయన చెప్పారు. ఒంటరిగా పోటీచేస్తేనే సానుకూల ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కూడ కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మనం చేసిన పాత్రను ప్రజలు మర్చిపోలేరని ఆయన చెప్పారు. ఈ కారణంగానే బిజెపితో పొత్తు పెట్టుకోలేదన్నారు.

ఎన్‌టిఆర్ వల్లే రాజకీయాల్లోకి వచ్చను

ఎన్‌టిఆర్ వల్లే రాజకీయాల్లోకి వచ్చను

తనను ఎన్‌టిఆర్ మార్చారని చెప్పారు జితేందర్‌రెడ్డి, ఒమన్‌లో ఉద్యోగం చేసే సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌టిఆర్‌ను కలిసినట్టు చెప్పారు.పవర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా కలిసినట్టు ఆయన చెప్పారు. అదే సమయంలో పార్టీలో సంక్షోభం నెలకొందన్నారు.అయితే పార్టీ సంక్షోభాన్ని నివారణకు ఆయన ప్రయత్నించేవాడు.దీంతో ఒప్పందం ఆలస్యమైందన్నారు.ఈ సమయంలోనే తాను రామచంద్రారెడ్డి కొడుకును అనే విషయాన్ని ఆయనకు చెప్పాననన్నారు. పార్టీ సంక్షోభ సమయంలో ఒకరోజు ఎన్‌టిఆర్ కళ్ళల్లో నీళ్ళు చూసినట్టు చెప్పారు. రాజకీయాలు ఎందుకని ఆయనను ప్రశ్నించాను. ప్రజలకు ఎంతోకొంత సేవ చేస్తే ప్రజలు నిన్నుగుర్తుపెట్టుకొంటారు.ఆ తృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదని ఎన్‌టిఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఈ మాటలు తనపై ప్రభావం చూపాయన్నారు. దీంతో రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన చెప్పారు.

కోవింద్‌కు వెంకటేశ్వరస్వామి దర్శనం

కోవింద్‌కు వెంకటేశ్వరస్వామి దర్శనం

రామ్‌నాద్ కోవింద్‌తో తనకు పాతపరిచయం ఉందన్నారు. లోక్‌సభలో రాజభాష కన్వీనర్‌గా నాతోపాటు ఆయన కూడ సభ్యుడే. ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తైన తర్వాత కూడ స్నేహం కొనసాగిందన్నారు. బీహర్ గవర్నర్ కాకముందే వెంకటేశ్వరస్వామి దర్శనం కావాలంటే తిరుపతిలోని విజిలెన్స్‌లో పనిచేసే శివకుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి చెప్పాను. దర్శనం బాగా జరిగిందని ఫోన్ చేసి మరీ చెప్పారు.అయితే ఆ తర్వాత గంటకే మళ్ళీ ఫోన్ చేసి తనను గవర్నర్‌గా ఎంపికచేసినట్టు చెప్పారని ఆయన గుర్తుచేసుకొన్నారు.

మోడీతో ఫ్రెండ్‌షిఫ్ ఎలా అయిందంటే?

మోడీతో ఫ్రెండ్‌షిఫ్ ఎలా అయిందంటే?

తాను బిజెపి ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బిజెపి తరపున సుమారు 13 మంది ఎంపీలు గెలిచాం. పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో శిక్షణ ఇవ్వడానికి మోడీ హైద్రాబాద్‌ వచ్చారని చెప్పారు. తనకు గుజరాతీ బాగా రావడంతో మూడురోజులపాటు ఎక్కువగా ఆయనతో మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. ఓసారి తన డ్రెస్ చూసి చాలా బాగుంది మాకు ఇప్పించరా అని అడిగారన్నారు. ఖాదీ బండార్‌కు వెళ్ళి మంచి డ్రెస్ ఇప్పించానని చెప్పారు. గుజరాత్‌లో భూకంపం వచ్చిన సమయంలో మోడీతో కలిసి తాను సినీ నటుడు నరేష్ సహయం చేసినట్టు ఆయన గుర్తుచేశారు. గుజరాత్ సిఎం అయ్యాక కూడ ఆయనను అభినందించి వచ్చినట్టు చెప్పారు.టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా తనను మోడీకి కెసిఆర్‌కు పరిచయం చేయబోతే ఆయన మా మనిషి అంటూ మోడీ చమత్కరించారని చెప్పారు.

శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రిపదవి రాకపోవడానికి కారణమిదే

శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రిపదవి రాకపోవడానికి కారణమిదే

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రిపదవి రాకపోవడానికి తాను కారణమనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఎవరు ఎంటనేది బాస్‌కు తెలుసునని చెప్పారు. తాను ఇవ్వమని చెబితే మంత్రి పదవి ఇస్తారా, వద్దంటే ఇవ్వకుండా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరి పొట్టకొల్టలేదన్నారు.

కోదండరామ్‌తో గొడవ ఎందుకంటే

కోదండరామ్‌తో గొడవ ఎందుకంటే

ప్రభుత్వానికి కోదండరామ్ సలహదారుడిగా ఉండాలి. కానీ, ఆయన దారి తప్పినట్టు అనిపిస్తోందన్నారు.. కానీ, కొంచెం కాలంపాటు వేచి ఉండాలని కోదండరామ్‌కు చెప్పాను కానీ, ఆయన వినలేదన్నారు. రెడ్లకు అన్యాయం జరుగుతోందని గర్జన చేస్తానంటారు. 18 మంది మంత్రుల్లో 8మంది రెడ్లున్నారన్నారు. కీలకమైన పదవుల్లో రెడ్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒకరిద్దరికి పదవులు రాకపోతే రెడ్లకు న్యాయం జరగనట్టు ఎలా చెబుతారన్నారు.

కెసిఆర్ తిట్టారు

కెసిఆర్ తిట్టారు

కెసిఆర్ తిట్లే ఆశీర్వాదాలని చెప్పారు. ఎవరైనా సరే ఒక్కోసారి గట్టిగా మందలిస్తారని చెప్పారు. చాలా లైక్‌చేసే వాళ్ళనే కెసిఆర్ తిడతారని చెప్పారు. వేరేవాళ్ళను దగ్గరకు రానివ్వరని చెప్పారు. కెసిఆర్ తనను తరచూ తిడుతూనే ఉంటాడని చెప్పారు. అయితే మనసులోనే మెచ్చుకొంటాడన్నారు. తనకు ముగ్గురు కొడుకులని చెప్పారు. అయితే పెద్దవాళ్ళు ఇద్దరూ బిజినెస్ చేస్తున్నారని చెప్పారు. చిన్నవాడు ఇటీవలే లా పూర్తిచేసినట్టు చెప్పారు. అయితే మా బాస్ గుర్తింపుపొందిన తర్వాతే రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. కానీ, తాను రికమండేషన్ చేయనని చెప్పారు.

English summary
Primeminister Modi close to me said Trs parliament leader Ap Jitendar reddy.ABN channel interviewed him on Sunday.Iam not responsiblity for Mahaboobnagar Mla Sirnivas goud didn't get cabinet minister he said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X