• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యువరాజు పుట్టిన రోజు.!కేటీఆర్ కు ఊహించని బహుమతి అందించిన వీరాభిమాని.!

|

హైదరాబాద్ : కొందరు రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఇక రాజకీయ నాయకులను అనుసరించే కార్యకర్తల అభిమానానికి మాత్రం ఒక్కోసారి ఆకాశమే హద్దుగా పరిణమిస్తుంటుంది. తమ అభిమానాన్ని చాటుకునేందుకు విలువైన సమాచారంతో కూడిన ఫోటోలే కాకుండా ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఆసక్తికర అంశాలను పొందుపరుస్తూ ఓ అరుదైన బహుమతిని సిద్దం చేసి తన అభిమాన రాజకీయ నేతకు అందజేస్తుంటారు కొందరు వీరాభిమానులు. అచ్చం ఇలాంటి ఘటనే మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్బంగా చోటుచేసుకుంది.

కేటీఆర్ పుట్టిన రోజు..

కేటీఆర్ పుట్టిన రోజు..

తెలంగాణలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అంటే ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో గర్జించిన యువ సింహంలా, తెలంగాణ సాధన ప్రక్రియ పూర్తయిన తర్వాత సమర్ధవంతమైన మంత్రిగా ఆయనకు తెలంగాణ ప్రజలనుండి మంచి గుర్తింపు లభించింది. అంతే కాకుండా విదేశీ సదస్సుల్లో ఆయన మాట్లాడే ఆంగ్ల భాషా సరళి, ధరించే టీషర్ట్ లు, తరుచుగా మార్చే హెయిర్ స్టయిల్, సినిమా నటులతో చేసే చిట్ చాట్ లు కేటీఆర్ కు అదనపు ఆకర్షణను తెచ్చి పెట్టాయి. అవసరం ఉంటే తప్ప స్పందిచని కేటీఆర్ తత్వం తెలంగాణ ప్రజలను మంత్ర ముగ్థులను చేస్తుంది. అంతటి ప్రజాధరణ పొందిన కేటీఆర్ జన్మదినం అంటే ఆయన అభిమానులకు పెద్ద పండగే మరి.

 బహుమతులు అందించడం ఆనవాయితీ..

బహుమతులు అందించడం ఆనవాయితీ..

కేటీఆర్ జన్మదినం సందర్బంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా రక్త దానం, పేదలకు పండ్లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం సర్వసాధారణంగా జరిగిపోయే అంశంగా మారిపోయింది. అంతే కాకుండా కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు అమూల్యమైన బహుమతిని తమ ప్రియతమ నేతకు అందివ్వాలని ఆరాటపడుతుంటారు. అనేక రకాలలైన బహుమతులను అందుకోసం సిద్దం చేస్తుంటారు. ఐతే బందూక్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ మంత్రి కేటీఆర్ కు వీరాబిమాని. కేటీఆర్ పుట్టిన రోజులను పురస్కరించుకుని ఓ అరుదైన, ఎవ్వరూ ఊహించని బహుమానాన్ని అందించారు లక్ష్మణ్.

అభిమాని ఇచ్చిన బహుమతి చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్..

అభిమాని ఇచ్చిన బహుమతి చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్..

ఇక బందూక్ లక్ష్మణ్ మంత్రి కేటీఆర్ కు అందించిన బహుమతి గురించి తెలుసుకున్న ప్రతిఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానరు. ఇస్తే గిస్తే ఇలాంటి బహుమతి ఇవ్వాలిగాని నాలుగురోజుల్లో స్టోర్ రూంకు తరలించే బహుమతులు ఇచ్చి ఏంలాంభం అనే భావన రాక మానదు. అంతటి విలువైన, అపురూపమైన, అమూల్యమైన బహుమతిని తన వీరాభిమాని నుండి కేటీఆర్ అందుకోవడం ఓ అపురూప ఘట్టం అంటున్నారు అభిమానులు. బందూక్ లక్ష్మణ్ అందించిన బహుమతి జీవతంలో బహుషా ఎవ్వరూ అందించరేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతుండడం విశేషం. ఇంతకీ బందూక్ లక్ష్మణ్ అందించిన ఆ అపురూపమైన బహుమతి గురించి తెలుకుందాం.

బందూక్ లక్ష్మణ్ అనుదైన బహుమతి..

బందూక్ లక్ష్మణ్ అనుదైన బహుమతి..

కేటీఆర్ తొలి జన్మదినం దగ్గర నుండి నేటి పుట్టిన రోజు వరకూ వచ్చే డేట్లతో ఉండే నగదు నోట్లను సేకరించారు లక్ష్మణ్. నోట్ల మీద ఉండే ఆరంకెల సిరీస్ నంబర్, జన్మదినం రోజుకు మ్యాచ్ అయ్యేట్టుగా చూసుకుని ఆ నోటును సేకరించి ఫోటోగా తీర్చిదిద్ది ఓ అపురూపమైన బహుమతిగా తీర్చిదిద్దాడు లక్ష్మణ్. అలా అన్ని రకాల నోట్లను, అన్ని పుట్టిన రోజులకు సరిపడేల సేకరించడం సామాన్యమైన అంశం కాదు. ఎంతో ఓపికతో పాటు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఏడాది కాలంగా అనేక రూపాల్లో సమాచారాన్ని పంపుతూ 240776 అలా ఉన్న సిరీస్ నోట్లను కొనుగోలు చేసి అపురూపమైన బహుమతిని తయారు చేసాడు లక్ష్మణ్. అంతే కాకుండా తాను రూపొందించిన ఫోటో ఫ్రేంలో కేటీఆర్ చిన్నతనంలో నివాసమున్న ఇంటి ఫోటోను కూడా పొందుపరిచాడు. ఇన్ని ప్రత్యేకతలతో కేటీఆర్ అందుకున్న బహుమతి ఎంతో అరుదైందనే చర్చ జరుగుతోంది.

English summary
Bandhuk film director Laxman is a big fan of Telangana Minister KTR. Laxman presented a rare and unexpected gift to KTR on his birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X