మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాస్టల్ లో నీటి కొరత .. విద్యార్థినుల జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపల్ .. షాక్ అయిన తల్లిదండ్రులు

|
Google Oneindia TeluguNews

ఎక్కడైనా నీటి కొరత ఉంది అంటే నీటిని పొదుపుగా వాడుకునే మార్గాలను అన్వేషిస్తారు. అయినా సరే నీటి కొరత తీవ్రంగా ఉంటే మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారు. ఇతర ప్రదేశాల నుంచి నీటిని తెచ్చి వాడుకోవడమా అనేది సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి చేస్తుంటారు. కానీ నీటి కొరత ఉందని, సమస్యలను అధిగమించలేక ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన ఘనకార్యం తెలిస్తే నివ్వెరపోతారు.

మెదక్ జిల్లా కేంద్రం లోని గురుకుల పాఠశాలలో నీటి కొరత .. నీటి ఆదా కోసం ప్రిన్సిపాల్ నిర్ణయం

మెదక్ జిల్లా కేంద్రం లోని గురుకుల పాఠశాలలో నీటి కొరత .. నీటి ఆదా కోసం ప్రిన్సిపాల్ నిర్ణయం

తాజాగా మెదక్ జిల్లా కేంద్రం లోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. స్థానిక గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.పాఠశాల ఆవరణలోని బోరుబావి ఇంకిపోవడంతో కొన్నాళ్లుగా నీటికొరత నెలకొంది. అక్కడ ఉన్న విద్యార్థులకు నీటి కొరతతో చాలా ఇబ్బంది ఎదురైంది. దీంతో నీటికొరతను తగ్గించేందుకు హాస్టల్‌లో ఉండే బాలికల విషయంలో ప్రిన్సిపాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులందరికీ జుట్టును కత్తిరించి నీటిని ఆదా చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ నిర్ణయించారు.

విద్యార్థినులు వద్దన్నా వినకుండా జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపాల్

విద్యార్థినులు వద్దన్నా వినకుండా జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపాల్

విద్యార్థినులు వద్దని వేడుకుంటున్నా వినకుండా.. శనివారం సాయంత్రం వారందరికీ బాలురి మాదిరిగా హెయిర్ కట్ చేయించారు.
మౌలిక అవసరాలకు సరిపడా నీరు లేకుంటే వాటర్ ట్యాంకర్ లతో తప్పించుకోవడం గానీ , అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడమో చేయాల్సిన చోట ఆ పాఠశాల ప్రిన్సిపల్ అమ్మాయి లందరికీ జుట్టు కత్తిరించి, బాయ్ కట్ చేయించి అవాక్కయ్యేలా చేశారు . ఇదేంటి అని అడిగితే నీటి కొరత అని తాపీగా చెపుతున్నారు ప్రిన్సిపల్ అరుణ . అమ్మాయిలు తలస్నానం చేసేందుకు అధిక నీరు అవసరం మవుతోంది.. అందుకని స్నానాల కోసం నీటి కొరత ఉందంటూ బాలికల జుట్టు కత్తిరించారు సదరు ఘనతవహించిన ప్రిన్సిపాల్.

పిల్లల్ని చూసేందుకు వెళ్ళిన తల్లిదండ్రులు షాక్ .. ప్రిన్సిపాల్ ఘనకార్యంపై ఆగ్రహం

పిల్లల్ని చూసేందుకు వెళ్ళిన తల్లిదండ్రులు షాక్ .. ప్రిన్సిపాల్ ఘనకార్యంపై ఆగ్రహం

180 మంది విద్యార్థినులకు వారి అవసరాలకు వినియోగించుకోవడానికి నీటిని, త్రాగు నీటిని అందించడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రిన్సిపల్ అరుణ తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బాయ్ కట్ తో కనిపిస్తున్న అమ్మాయిలను చూసి నివ్వెరపోయారు. కనీసం మాకు చెప్పకుండా మా పిల్లల చుట్టూ ఎందుకు కత్తిరించారు అని ప్రిన్సిపాల్ ను నిలదీశారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఆదివారం, బక్రీద్ సందర్భంగా సోమవారం వరుస సెలవు దినాలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని కలిసేందుకు అక్కడకు వెళ్లి ఖంగుతిన్నారు. అబ్బాయిల్లా హెయిర్ కట్ తో కన్పించిన తమ అమ్మాయిల జుట్టు కత్తిరింపుపై తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు.

English summary
Recently there was a severe water shortage in the tribal mini Gurukul school in Medak district center. In this backdrop, the school principal decided to save the water by cutting hair for all the girl students. The students cut their hair like boys on Saturday evening without hearing the students pleasing. The parents of the students went to meet the children as it was a holiday and they shocked the hair style of their children. they fired on principal .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X