• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..!మోదీ సంస్కరణలతో దేశం వెలిగిపోతోందన్న బండి సంజయ్..!

|

ఢిల్లీ/హైదరాబాద్ : దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయదారుల అవసరాలకనుగుణంగా ప్రభుత్వాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పుడే దేశ సత్వర అభివృద్దికి వేగంగా అడుగులు పడతాయని తెలంగాణ రాష్ట్ర బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ ఉద్ఘాటించారు. దేశంలో వ్యవసాయదారుల కోసం ఇప్పటి వరకూ ఏ ప్రధానమంత్రి తీసుకోని సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ ఆవిష్కరించడం హర్షించదగ్గ పరిణామమని సంజయ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయదారుల సంక్షేమం కోసం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని ఆయన స్వాగతించారు.

వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది బీజేపినే.. నేటి ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన బండి సంజయ్..

వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది బీజేపినే.. నేటి ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన బండి సంజయ్..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వెలిగిపోతోందని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా శుక్రవారం వ్యవసాయం, మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, అనుబంధ రంగాలకు పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం పట్ల సంజయ్ హర్షం వ్యక్తం చేసారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి పెద్దఎత్తున ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుని దేశానికే తలమానికంగా నిలిచారని ప్రశంసించారు.

మోదీ నేతృత్వంలో దేశాభివృద్ది.. బీజేపి రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్న సంజయ్..

మోదీ నేతృత్వంలో దేశాభివృద్ది.. బీజేపి రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్న సంజయ్..

దాదాపు లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయ రంగ మౌళిక కల్పన కోసం కేటాయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు బండి సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం దేశ ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాల్లో లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతుల అభివ్రుద్ధి నిధి ఏర్పాటు చేయడం, మార్కెట్ యార్డుల నిర్మాణంపై ద్రుష్టి సారించడం, మైక్రో వుడ్ ఎంటర్ ప్రైజెస్ కోసం 10వేల కోట్ల రూపాయలతో కొత్త పథకం తీసుకురావడం స్వాగతించదగ్గ పరిణామమని బండి సంజయ్ పేర్కొన్నారు.

రైతుల కోసం లక్ష కోట్టు .. మోదీ సాహసోపేత నిర్ణయమన్న టీ బీజేపి ప్రసిడెంట్..

రైతుల కోసం లక్ష కోట్టు .. మోదీ సాహసోపేత నిర్ణయమన్న టీ బీజేపి ప్రసిడెంట్..

అంతే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేలా మౌలిక వసతుల అభివ్రుద్ధి కోసం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు బండి సంజయ్. ముఖ్యంగా నిత్యావసరాల చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమన్నారు. అటు రైతులు నచ్చిన చోట ఉత్పత్తులను అమ్ముకునేలా వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిందకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు బండి సంజయ్.

  Leopard Not Yet Found, Budvel People In Fear | డ్రోన్ల సహాయం తో..!!
  దేశం స్వావలంబన దిశగా అడుగులు.. మోదీ వల్లే సాద్యమైందన్న సంజయ్..

  దేశం స్వావలంబన దిశగా అడుగులు.. మోదీ వల్లే సాద్యమైందన్న సంజయ్..

  ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో సాహసోపేతమైనవే కాకుండా విప్లవాత్మకమైనవని బండి సంజయ్ గర్తు చేసారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడానికి తీసుకున్న ఈ చర్యలతో దేశం స్వావలంబన దిశగా అడుగులు వేయడం ఖాయమన్నారు. కరోనా వైరస్ విపత్తు వేళ ఇలాంటి సాహసోపేత ప్యాకేజీ ప్రకటించి, ప్రజల మనసులు గెలుచుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదని తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు.

  English summary
  Telangana State President Bandi Sanjay said that Narendra Modi's take on the welfare schemes that the any Prime Minister has not taken for farmer in the country is a significant consequence.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more