హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట, ఈ-హెల్త్ సేవలను ప్రారంభించిన కేటీఆర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు వివాదంపై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. జేఎన్‌టీయూ అనుమతించని 25 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది.

మరోసారి కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించింది. బుధవారం నుంచి కౌన్సెలింగ్‌కు అనుమతించాలని మధ్యంతర ఆదేశాలను హైకోర్టు జారీచేసింది. హైకోర్టు తీర్పుతో 25 కాళాశాలల్లో కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం కానుంది.

Private engineering colleges reprieve in the high court

జేఎన్‌టీయూ తనిఖీల్లో భాగంగా 25 ఇంజినీరింగ్‌ కళాశాలలు అనుబంధ గుర్తింపు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ-హెల్త్ సేవలను ప్రారంభించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంకగా ప్రవేశపెట్టిన ఈ-హెల్త్ సేవలను పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జడ్చర్లలో ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్ మాట్లాడుతూ ఈ-హెల్త్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరతుందని చెప్పారు.

English summary
Private engineering colleges reprieve in andhra pradesh high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X