హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka murder case:హై సెక్యూరిటీ బ్యారక్‌లో ప్రియాంక హత్య కేసు నిందితులు, ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్‌నగర్ పీఎస్ నుంచి చర్లపల్లికి నిందితులను తీసుకొచ్చినా.. ఇక్కడ కూడా భారీగా జనం గుమిగూడారు. మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితులకు తక్షణమే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతున్నారు. స్థానికుల ఆందోళనతో చర్లపల్లి జైలు ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

హై సెక్యూరిటీ బ్యారక్..

హై సెక్యూరిటీ బ్యారక్..

చర్లపల్లి జైలుకు ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను తరలించారు. నిందితులు దొరికితే చాలు ప్రజలు హతమారుస్తారనే సీన్ క్రియటైంది. దీంతో వారిని హై సెక్యూరిటీ బ్లాక్‌‌లో ఉంచారు. సాధారణంగా ఉండగా నేరాభియోగం ఎదుర్కొన్న రాజకీయ నేతలు, లేదంటే ఉగ్రవాదులను మాత్రమే ఉంచుతారు. వీరు కూడా నరరూప రాక్షసులే కానీ.. వారికి ప్రజలతో ముప్పు ఉన్నందున అధికారులు రక్షణ చర్యలు తీసుకున్నారు.

5 నిమిషాలు చాలు

5 నిమిషాలు చాలు

నిందితులను తమకు అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు. అప్పగిస్తే చాలు ఉరేసి చంపుతామని నినాదిస్తున్నారు. ప్రియాంకకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దని సూచిస్తున్నారు. చట్టం, న్యాయం పక్కనపెట్టి తమకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. జైలు వద్ద భారీగా జనం గుమిగూడటంతో వారిని పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరితో వాగ్వివాదం కూడా జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా కొందరినీ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

ఇదీ రిమాండ్ రిపోర్ట్

ఇదీ రిమాండ్ రిపోర్ట్

ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో కూడా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ప్రియాంకకు మద్యం తాగించి హత్య చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు మహ్మద్.. ప్రియాంక నంబర్ తీసుకున్నట్టు తెలిసింది. ప్రియాంక కాల్ డేటా ఆధారంగా మహ్మద్‌ను గుర్తించారు. లారీ క్యాబిన్‌‌లో కూడా ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

కబంధహస్తాల్లో..

కబంధహస్తాల్లో..

బుధవారం రాత్రి మానవృగాలకు బందీగా చిక్కిన ప్రియాంకకు.. వారు చుక్కలు చూపించారు. తమ వద్ద ఉన్న మద్యం కూడా తాగించారనే కఠోర నిజం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యం చేశారని తెలుస్తోంది. అప్పుడు కూడా కేకలు పెట్టిన కీచకులు కరుణించలేదు. తమ వాంఛను తీర్చుకొని మట్టుబెట్టారు.

నిరసన సెగలు

నిరసన సెగలు

శనివారం ఉదయం నుంచి షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితులు పీఎస్‌లో ఉన్నారని తెలుసుకొని భారీగా స్థానికులు తరలొచ్చారు. వారు ఎక్కడ స్టేషన్‌లోపలికి వస్తారని భయపడి.. గేటుకు తాళం వేశారు. చివరికి టాస్క్‌ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగడంతో వారిని జైలుకు తరలించారు. అంతకుముందు పీఎస్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. 14 రోజులు రిమాండ్ విధించడతో చర్లపల్లి జైలుకు తరలించారు.

English summary
priyanka murder accused are high security barak in cherlapally prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X