హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka reddy: నిందితులు ఐదుగురు కాదు నలుగురే: డీసీపీ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులతోపాటు మరో నిందితుడు కూడా ఉన్నాడని జరుగుతున్న ప్రచారంపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ప్రియాంక ఘటనపై తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

priyanka reddy murder: ధుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో.: విజయశాంతి ఆవేదనpriyanka reddy murder: ధుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో.: విజయశాంతి ఆవేదన

ప్రియాంక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ కేసులో ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్, లారీ డ్రైవర్, ఏ2 జొల్లు శివ, ఏ3 నవీన్, ఏ4గా చింతకుంట చెన్నకేశవులు ఉన్నారు. ఈ నిందితులను శనివారం మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చి, 14 రోజులపాటు రిమాండ్‌కు విధించారు. ఈ నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.

 Priyanka murder: accused persons four not five says dcp prakash reddy

అయితే, ప్రియాంక హత్య కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పష్టతనిచ్చారు. కేసులో పట్టుబడిన నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని, ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పస్టం చేశారు.

ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని చెప్పారు. కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి వివరించారు.

English summary
Priyanka murder: accused persons four not five says dcp prakash reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X