హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka reddy murder : నిందితుల విషయంలో లాయర్ల సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన సంఘటన ఇప్పుడు దేశాన్ని కదిలిస్తుంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది.ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. నేరస్తులకు శిక్ష వేయడంలో తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని అటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు నేడు నిందితులను తీసుకు వెళ్లనున్న క్రమంలో తీవ్ర ఆందోళనలు, అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారిని ఉరితీయాలని, వారికి ఉరే సరైన శిక్ష అని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులు, స్థానికులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు హత్య కేసు నిందితులకు ప్రజల నుండి ఎలాంటి హానీ జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కఠినంగా శిక్షపడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Priyanka reddy murder :Lawyers Sensational Decision not to support and argue for Accused

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested

ఇక దేశవ్యాప్తంగా నిర్భయను తలపించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోవడంతో అడ్వకేట్లు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాయర్లు ఎవరూ కూడా నిందితులకు సహాయం చేయకూడదని, వారి తరఫున వాదించిన కూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదులు సైతం తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారు.

మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో ఎవరు వారి తరపున వాదించని పరిస్థితి. అంతేకాదు నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయపోరాటం చేస్తామని లాయర్లు చెప్తున్న నేపథ్యంలో, కోర్టులో నిందితులకు ఏ విధమైన శిక్ష పడుతుంది. ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వారికి కోర్టులు ఎప్పటి వరకు శిక్షను విధిస్తాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
Advocates have also made a sensational decision in the state of Telangana as the nation is outraged on the incident of dr. priyanka reddy gang rape and murder. The lawyers decided not to help any of the accused to argue on their behalf. Advocates are expected to play their part in preventing such incidents from happening again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X