హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుబాటులో లేని మేజిస్ట్రేట్, తహశీల్దార్ వద్దకు ప్రియాంక హత్యకేసు నిందితులు, పీఎస్ వద్ద ఆందోళన...

|
Google Oneindia TeluguNews

ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులు షాద్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఉన్నారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పోలీసులు స్టేషన్‌కు తాళం వేశారు. పీఎస్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

priyanka reddy murder..జాతీయ మహిళా కమిషన్ సభ్యుల విచారణ ప్రారంభం...ప్రియాంక తల్లిదండ్రులకు పరామర్శ priyanka reddy murder..జాతీయ మహిళా కమిషన్ సభ్యుల విచారణ ప్రారంభం...ప్రియాంక తల్లిదండ్రులకు పరామర్శ

 తహశీల్దార్ ముందు..

తహశీల్దార్ ముందు..

మహ్మద్ అలియాస్ ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ షాద్ నగర్ మేజిస్ట్రేట్ అందుబాటులో లేరు. దీంతో ఏం చేయాలని పోలీసులు మదనపడుతున్నారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహశీల్దార్ వద్ద ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కానీ స్టేషన్ ఎదుట స్థానికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టేషన్ నుంచి వారిని బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేదు.

 అదుపులోకి లారీ ఓనర్

అదుపులోకి లారీ ఓనర్

లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దే మహ్మద్ పనిచేస్తున్నారు. మహ్మద్ ఎప్పటినుంచి పనిచేస్తున్నాడు.. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా.. తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. లారీ ఆన్ లోడింగ్ ఎందుకు అవలేదు. తదితర అంశాలపై స్టేషన్‌లో విచారిస్తున్నారు. అతను చెప్పే సమాధానం బట్టి తమ తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు.

ఉరే సరి..

ఉరే సరి..

ప్రియాంకరెడ్డి నిందితులకు ఉరి శిక్ష విధించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అలా అయితేనే ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరుతుందని వారు అంటున్నారు. ప్రియాంకలా మరో యువతికి అన్యాయం జరగొద్దని చెప్తున్నారు. నిందితులకు త్వరితగతిన శిక్ష ఖరారు చేయాలని కోరుతున్నారు. ప్రియాంక హత్య కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు శుక్రవారం సీపీ సజ్జనార్ అప్పగించిన సంగతి తెలిసిందే.

టెన్షన్.. టెన్షన్

టెన్షన్.. టెన్షన్

షాద్‌నగర్ పీఎస్ వద్ద స్థానికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిందితులపై తక్సణం శిక్ష అమలు చేయాలని ఆందోళన చేపడుతున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. ఆందోళనకారులు పీఎస్‌లోకి చొచ్చుకొస్తారనే భయంతో గేటుకు తాళం వేశారు. మరోవైపు విద్యార్థి సంఘం నేతలు, ప్రజా సంఘాల నేతలతో పోలీసులు చర్చిస్తున్నారు.

English summary
shadnagar magistrate is not available. priyanka reddy accused will be introduce tahasildhar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X